YVS Chowdary: డైరెక్టర్ వైవిఎస్ చౌదరి.. భార్య గురించి తెలియని విషయాలు..!

YVS Chowdary.. తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ముఖ్యంగా శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండి, యువరాజు, సీతయ్య, దేవదాసు తదితర చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగా మెప్పించారు. అయితే ఆ తర్వాత తను తెలిసిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులు కావడంతో దాదాపుగా 9 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు వైవిఎస్ చౌదరి. ఇప్పుడు తాజాగా మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నిర్మాతగా మారనున్న వైవిఎస్ చౌదరి భార్య..

YVS Chowdary: Unknown things about director YVS Chowdary's wife..!
YVS Chowdary: Unknown things about director YVS Chowdary’s wife..!

ఇటీవల నందమూరి జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావును వైవిఎస్ చౌదరి హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా చిత్ర బృందం ప్రకటించారు. ఇలాంటి సమయంలోనే డైరెక్టర్ వైవిఎస్ చౌదరి భార్య గురించి కూడా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వైవిఎస్ చౌదరి భార్య పేరు గీత.. ఈమె కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. ముఖ్యంగా నాగర్జున నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం నిన్నే పెళ్ళాడుతా సినిమాలో కూడా నటించింది. ఇందులో నాగార్జున చెల్లెలి పాత్రలో గీత నటించినట్లు తెలుస్తోంది.

వై వి ఎస్ చౌదరి భార్య కూడా హీరోయినే..

ఆ తర్వాత హీరో రవితేజ నటించిన సింధూరం సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్గా కనిపించింది. నటిగా ఎన్నో చిత్రాలలో నటించిన గీతా మాత్రం వైవిఎస్ చౌదరిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నది.గతంలో డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన నిన్నే పెళ్లాడతా సినిమా సమయంలో వైవిఎస్ చౌదరి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉండేవారట.. ఆ సమయంలోనే గీతాతో పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. మొదట ఇద్దరి కులాలు వేరు అవ్వడంతో కుటుంబ సభ్యులు మాత్రం వీరి వివాహానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఇద్దరూ పెద్దలను ఒప్పించుకొని మరీ వివాహం చేసుకున్నారట.

- Advertisement -

వైవిఎస్ చౌదరి – గీత ప్రేమ, పెళ్లి..

వైవీఎస్ చౌదరి- గీతా కు ప్రస్తుతం ఇద్దరు కూతుర్లు. అయితే వివాహం తర్వాత గీత సినిమాలకు దూరమైనప్పటికీ.. ప్రస్తుతం పలు సినిమాలకు నిర్మాతగా మారినట్లు తెలుస్తోంది. అలాగే జానకి రామ్ కుమారుడు ఎన్టీఆర్ ని హీరోగా పరిచయం చేస్తున్న సినిమాకి కూడా గీత సొంతంగానే తన బ్యానర్ మీద నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా న్యూ క్యాలెండర్ రోర్స్ @Ntr అనే ఒక కొత్త బ్యానర్ ని స్థాపించి తన భర్త డైరెక్షన్ లోనే ఈ సినిమాని నిర్మించేలా చేస్తోంది. గతంలో నటిగా మెప్పించిన గీత మరి నిర్మాతగా ఎలాంటి సినిమాలను ముందుకు తీసుకువచ్చి మెప్పిస్తుందో చూడాలి మరి. ఏది ఏమైనా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి భార్య కూడా సినీనటి అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మూడవ ఎన్టీఆర్ సక్సెస్ అవుతారా..

ఇకపోతే హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఇద్దరూ ఎన్టీఆర్లు ఇండస్ట్రీని ఏలుతుంటే ఇప్పుడు మూడవ ఎన్టీఆర్ ఏవిధంగా ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి. ఇక ఈ ఎన్టీఆర్ కి ప్రేక్షకులు ఏమని పేరు పెడతారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Yvs Chowdarry (@i_am_yvs)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు