Sita ramam- Karthikeya2 : షేక్ చేస్తున్నాయి

కష్టాల్లో ఉన్న టాలీవుడ్ కు ఊపిరి పోసిన సినిమాలు సీతారామం, బింబిసార, కార్తికేయ2. భారీ కలెక్షన్లతో ఈ మూడు సినిమాలు రికార్డులను నమోదు చేస్తున్నాయి. కాగా ఈ మూడు సినిమాలు ఆగస్టులోనే రావడం విశేషం. ఇదిలా ఉండగా, సీతారామం, కార్తికేయ2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు.. అమెరికాలోనూ దుమ్ములేపుతున్నాయి. నిజానికి అమెరికాలో 1 మిలియన్ డాలర్లు కలెక్షన్లు రాబట్టడమే చాలా కష్టం.

ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది అమెరికాలో 1 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసిన లిస్ట్ లో.. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, ఎఫ్3, అంటే సుందరానికి, సీతారామం, కార్తికేయ2 సినిమాలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట ఏకంగా 2.3 మిలియన్ డాలర్ల కలెక్షన్లు చేసింది.

తాజాగా ఇప్పుడు సీతారామం, కార్తికేయ2 అమెరికాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన ఈ రెండు సినిమాలు మరింత స్పీడ్ గా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే కార్తికేయ2 1.5 మిలియన్ డాలర్లను అందుకుంది. అలాగే ఈ సినిమా విడుదలైన నాలుగో వారంలో కూడా 80కి పైగా ప్రాంతాల్లో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. అలాగే సీతారామం 1.5 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడానికి అత్యంత సమీపంలో ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ ముచ్చట తీరబోతుందని చెప్పచ్చు.

- Advertisement -

కాగా సీతారామం సినిమా ఆగస్టు 5న, కార్తికేయ 2 ఆగస్టు 13న విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగులో గానీ, బాలీవుడ్ లో గానీ వచ్చిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఈ రెండు సినిమాలు తిరుగులేకుండా రాణిస్తున్నాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు