12 Digit Masterstroke on OTT : ఆధార్ కార్డు అసలు కథ ఏంటో తెలుసా? ఓటిటిలో ఈ ఒక్క డాక్యుమెంటరీ చూస్తే అన్ని డౌట్స్ క్లియర్

12 Digit Masterstroke on OTT : ఎన్నో వెబ్ సిరీస్ లు, సినిమాలు రియల్ లైఫ్ లో జరిగే విషయాలపై రూపొంది ఓటీటీలోకి వస్తున్నాయి. ముఖ్యంగా స్కామ్స్, క్రైమ్ స్టోరీలు. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ జానర్లలో తెరకెక్కినవి కూడా ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా అసలు మన జీవితాల్లో ముఖ్యమైన భాగంగా మారిన ఆధార్ కార్డు గురించి మాత్రం ఇప్పటిదాకా ఒక్క వెబ్ సిరీస్ లేదా సినిమా రాలేదు. మరి మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయమే ఇది కదా. అందుకే తాజాగా ఆధార్ కార్డు గురించి తెరపై చూపించే సన్నాహాలు మొదలయ్యాయి. కానీ వెబ్ సిరీస్ లేదా సినిమా రూపంలో కాకుండా ప్రేక్షకులకు బాగా అర్థమయ్యే రీతిలో ఓ డాక్యుమెంటరీ రూపంలో రాబోతోంది.

భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆధార్ కంపల్సరీ అన్న విషయం తెలిసిందే. మరి భారతీయులందరి జీవితంలో భాగమైన ఈ ఆధార్ కార్డు అసలు ఎందుకు? అది లేకపోతే ఏమవుతుంది ? అని ఎంతో మందికి డౌట్ వచ్చి ఉంటుంది. కొంత మందికి మాత్రమే వీటికి సమాధానాలు తెలుసు. కానీ చాలా మంది ఈ డౌట్స్ ఎవ్వరిని అడగాలే తెలియక సైలెంట్ గా అందరినీ ఫాలో అవుతూ ఉంటారు. ఆ డౌట్స్ అన్ని ఈ ఒక్క డాక్యుమెంటరీని చూసే తెలుసుకోవచ్చు. మరి ఆ డాక్యుమెంటరీ ఏంటి? ఏ ఓటిటిలో ఎప్పుడు రాబోతోంది? అనే విషయంలోకి వెళ్తే…

ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరి దగ్గర గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఉన్న విషయం తెలిసిందే. మన జీవితాల్లో గ్యాస్ దగ్గర నుంచి పింఛన్ దాకా ఏం జరగాలన్నా కూడా ఆధార్ కార్డు కచ్చితంగా ఉండి తీరాల్సిందే. మరి అసలు ఈ ఆధార్ కార్డు కథ ఏంటి? దాని మీద ఉండే నెంబర్ కి అర్థమేంటి? అసలు మన జీవితంలోకి ఈ ఆధార్ ఎందుకు వచ్చింది? ఎందుకు ప్రతి సేవను ఆధార్ కార్డుకు లింక్ చేసి పెట్టారు? అనే డౌట్స్ అన్ని తీర్చడానికే త్వరలో 12 డిజిట్ మాస్టర్ స్ట్రోక్ ది అండ్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఆధార్ అనే డాక్యుమెంటరీ రాబోతోంది. ఈ డాక్యుమెంటరీని ఎక్కడో కాదు డైరెక్ట్ గా యూట్యూబ్ లో చూడొచ్చు. మే 3 నుంచి ఆధార్ కార్డు అసలు కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ డాక్యుమెంటరీ రిలీజ్ కాబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాబట్టి ఆధార్ గురించి మీకున్న డౌట్స్ ను తీర్చుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ పై ఓ లుక్కెయ్యండి.

- Advertisement -

పుట్టక నుంచి చావు దాకా మన జీవితంలో ప్రతి విషయంలోను కీలక పాత్ర పోషిస్తున్న ఆధార్ కార్డు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. అందుకే ఈ ఆధార్ కాన్సెప్టు ఎలా మొదలైంది? ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రస్తుతం దీని వల్ల జరుగుతున్న, జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఈ డాక్యుమెంటరీలో మేకర్స్ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. కాబట్టి డోంట్ మిస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు