OTT Movies : ఓటీటీలోకి రాబోతున్న 18 సినిమాలు.. ఆ రెండు సినిమాలను తప్పక చూడాలి..

OTT Movies : ప్రతి వారం లాగా ఈ వారం కూడా ఓటీటీలోకి పదుల సంఖ్యలో సినిమాలు విడుదల అవుతున్నాయి. అటు థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఇక్కడ భారీ సక్సెస్ ను అందుకున్నాయి. ఆగస్టు 15 న సినిమాలు కాస్త ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి. ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఫెయిలయ్యాయి. ‘ఆయ్’ అనే చిన్న మూవీ పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడమే కాదు మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ‘తంగలాన్’ తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇదిలా ఉండగా ఈ వారం చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటి రిలీజ్ కావడం లేదు. ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ అనే తెలుగు మూవీ, ‘డీమోంటీ కాలనీ 2’ అనే డబ్బింగ్ సినిమా థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక ఓటీటీలో ఈ వారం కల్కి సినిమా రాబోతుంది. అలాగే రాయన్ సినిమా కూడా రాబోతుంది. ఈ రెండు సినిమాల పై జనాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

18 movies coming to OTT.. Must watch those two movies..
18 movies coming to OTT.. Must watch those two movies..

నెట్‌ఫ్లిక్స్..

టెర్రర్ ట్యూజ్‌డే: ఎక్స్‌ట్రీమ్ (థాయ్ సిరీస్) – ఆగస్టు 20

- Advertisement -

జీజీ ప్రీసింక్ట్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 22

కల్కి 2898 ఏడీ (హిందీ వెర్షన్) – ఆగస్టు 22

మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 22

ప్రె‍ట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ద మూవీ పార్ట్ 1 (జపనీస్ సినిమా) – ఆగస్టు 22

ఇన్ కమింగ్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 23

ద ఫ్రాగ్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 23

అమెజాన్ ప్రైమ్..

యాంగ్రీ యంగ్ మ‍్యాన్: ద సలీం జావేద్ స్టోరీ (హిందీ సిరీస్) – ఆగస్టు 20

కల్కి 2898 ఏడీ (తెలుగు సినిమా) – ఆగస్టు 22

ఫాలో కర్‌లో యార్ (హిందీ సిరీస్) – ఆగస్టు 23

రాయన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 23

ఆహా..

ఉనర్వుగల్ తొడరకథై (తమిళ సినిమా) – ఆగస్టు 23

హాట్‌స్టార్..

గర్‌ర్‌ర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 20

ద సుప్రీమ్స్ ఎట్ ఎర్ల్స్ ఆల్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 23

లయన్స్ గేట్ ప్లే..

ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 23

జియో సినిమా..

డ్రైవ్ ఏవే డాల్స్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 23

మనోరమ..

స్వకార్యం సంభవబాహులం (మలయాళ మూవీ) – ఆగస్టు 23

ఆపిల్ ప్లస్ టీవీ..

పచింకో సీజన్ 2 (కొరియన్ సిరీస్) – ఆగస్టు 23

మొత్తంగా చూసుకుంటే ఈవారం ఏకంగా 18 సినిమాలు విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. మూవీ లవర్స్ కు పండగే.. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు