OTT Movie : గొడవల్లో ముందుంటున్నారా? యాంగ్రీ యంగ్ మెన్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

OTT Movie : ఈ వారం ఓటీటీలో పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఇలా తెలుగు సినిమాలతో పాటు ఏ భాషకు సంబంధించిన సినిమాలు రిలీజ్ అయినా అరచేతుల్లో ప్రపంచం, అందులోనూ ఓటీటీలు ఉండనే ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులు లాంగ్వేజ్ బారియర్ అనేది అడ్డు కాదని ప్రూవ్ చేస్తున్నారు. అన్ని భాషల సినిమాలను చూసి కంటెంట్ బాగుంటే ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక కన్నడ క్రైం థ్రిల్లర్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? సినిమా పేరేంటి? అని విషయాలను తెలుసుకుందాం.

ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి అడుగు పెడుతుండడం విశేషం. కొన్ని సినిమాలకు కమర్షియల్ గా పెద్దగా రెస్పాన్స్ రాదు. కంటెంట్ బాగున్నా ఆశించిన ఆదరణ దక్కదు. కానీ ఓటీటీలో మాత్రం అలా కాదు. సినిమా బాగుంటే ఆదరణ దానంతట అదే దక్కుతుంది. ఏ ప్రమోషన్ అక్కర్లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. గత ఏడాది కన్నడలో రిలీజ్ అయిన క్రైమ్ డ్రామా 19.20.21. ఈ మూవీకి ఐఎండిబి లో ఏకంగా 9.2 రేటింగ్ రావడం విశేషం. ఈ రేంజ్ రేటింగ్ ఉందంటే మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదైతేనేం ఇంతకాలం గ్యాప్ తర్వాత ఓటిటిలోకి వచ్చిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన మూవీ. అయితే ఈ మూవీ ప్రస్తుతం రెంటల్ బేసిస్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే రెంట్ పే చేస్తేనే మూవీని చూసే ఛాన్స్ ఉంటుంది. మరి ఫ్రీగా ఎప్పుడు చూడొచ్చు అంటే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అలాగే ఈ మూవీ తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపై కూడా స్పష్టత లేదు. భాష అనేది అడ్డు కాదు అనుకుంటే తప్పకుండా ఓసారి చూసేయండి.

19.20.21 Review: The New Chapter in Mansore's Ambitious Oeuvre Works Best  As A Didactic History Lesson

- Advertisement -

స్టోరీ లోకి వెళ్తే…

19. 20. 21 అనేది వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన మూవీ. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసున్న అబ్బాయిలు ఎంత ఆవేశంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి టైంలో ఉడుకు రక్తంతో అనవసరమైన గొడవలకు పోయి లేనిపోని తలనొప్పులను తెచ్చి పెడతారు. ఇక స్టూడెంట్ గా ఉన్న వాళ్ళైతే ఏకంగా కేసుల్లో కూడా చిక్కుకుంటారు.. ఇలా స్టూడెంట్ పై కేసు నమోదు అయితే ఏం జరుగుతుంది? బెయిల్ రాకపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకున్న ఆ స్టూడెంట్ జీవితం చివరికి ఏమవుతుంది? అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీనే ఇది. కాబట్టి డోంట్ మిస్. ముఖ్యంగా ఆవేశానికి పోయి పనికిమాలిన గొడవలను తలపై తెచ్చి పెట్టుకునేవారు అస్సలు ఈ మూవీని మిస్ కావద్దు. అంతేకాదు చదువుకునే యంగ్ జనరేషన్ కూడా చూడాల్సిన మూవీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు