Maharaj : ఓటిటి లో విడుదలైన అమీర్ ఖాన్ కొడుకు మొదటి సినిమా..! రెస్పాన్స్ ఎలా ఉందంటే?

Maharaj : టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో వారసుడి సినిమా రిలీజ్ అయిందంటే ఏ రేంజ్ లో ఇండస్ట్రీ లో ప్రమోషన్ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యూస్ ఛానళ్ళు కూడా ఆ వారసుడిపై ఫోకస్ చేసి హీరో సక్సెస్ అవుతాడా లేదా అంటూ సర్వేలు మొదలెడతారు. ఇక స్టార్ హీరో అభిమానులు కూడా ఆ వారసుడికి గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. కానీ బాలీవుడ్ లో ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరో కొడుకు రీసెంట్ గా లాంచ్ అయితే బాలీవుడ్ లో ఏ సందడి లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరూ అంటారా? మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఈయన కొడుకు జునైద్ ఖాన్ గురించి పెద్దగా జనాలకి తెలీదు. జునైద్ ఖాన్ అమీర్ ఖాన్ మొదటి భార్య రీనూ దత్త కొడుకు కాగా, సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి రాగా, తాజాగా “మహారాజ్” (Maharaj) అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా, థియేటర్లో కాకుండా డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ ఓటిటి లో విడుదలైంది ఈ సినిమా. అయితే తన కొడుకు సినిమా అయినా అమీర్ ఖాన్ పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. జస్ట్ సపోర్ట్ మాత్రమే చేయగా, ఏ హంగు ఆర్భాటం లేకుండా సైలెంట్ గా ఓటిటి లో రిలీజ్ చేసారు మేకర్స్.

Aamir Khan Son Junaid khan "Maharaj" Movie OTT Responce

మహారాజ్ టాక్ ఎలా ఉందంటే?

ఇక అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తొలి సినిమానే వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం. తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ కొద్దిరోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ లో జరగాల్సిన స్ట్రీమింగ్ ని కొందరు హిందూ ప్రతినిధులు ఆపేశారు. వాదనలు విన్న గుజరాత్ హై కోర్టు స్వయంగా మూవీని చూసి చిన్న చిన్న అభ్యంతరాలు తప్ప ఏమీ లేదని తీర్పు ఇచ్చింది. దీంతో ఎలాంటి హడావిడి లేకుండా నిన్న (జూన్ 21) సైలెంట్ గా విడుదల చేశారు. ఇంత వివాదం చెలరేగిన మహరాజ్ లో నిజంగా అంత విషయముందా లేదా అంటే, మిశ్రమ స్పందన వస్తున్నాయి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది.

- Advertisement -

కథ విషయానికి వస్తే…

ఇక మహారాజ్ కథ విషయానికి వస్తే.. 1862లో జరిగిన మహరాజ్ లిబెల్ కేసు ఆధారంగా దర్శకుడు సిద్దార్థ్ పి మల్హోత్రా దీన్ని తెరకెక్కించాడు. జర్నలిస్ట్ గా సామజిక బాధ్యతను ఫీలయ్యే కర్షన్ దాస్ (జునైద్ ఖాన్) స్థానికులు దేవుడిగా కొలిచే జెజె అలియాస్ మహరాజ్ ( జైదీప్ ఆహ్లావత్ ) లోని రహస్య కోణాన్ని ప్రపంచానికి చెప్పాలని కంకణం కట్టుకుంటాడు. మతాన్ని అడ్డుపెట్టుకుని అమాయకులను, అమ్మాయిలను జేజే మోసం చేస్తున్న వైనాన్ని పేపర్ ద్వారా బహిర్గతం చేస్తాడు. దీంతో వ్యవహారం న్యాయస్థానం చేరుతుంది. పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా కర్షన్ దాస్ వ్యవస్థకు ఎదురు నిలిచి ఎలా గెలిచాడనేది మహరాజ్ అసలు కథ.

రొటీన్ స్టోరీ…

ఇక ప్రముఖ రచయిత సౌరభ్ షా రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కిన మహరాజ్ ని సుప్రసిద్ధ యష్ రాజ్ ఫిలింస్ నిర్మించింది. ఇక పీరియాడిక్ నేపథ్యంలో నూటా యాభై ఏళ్ళ క్రితం నేపధ్యాన్ని తీసుకున్న సిద్దార్థ్ దాన్నిఆసక్తికరంగా మలచడంలో తడబడ్డాడు. జెజె అలియాస్ మహరాజ్ చీకటి ప్రపంచాన్ని ఒక విలేఖరి బయటికి తీయడమనే పాయింట్ లో మంచి వెయిట్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే బలహీనతల వల్ల నిస్సారంగా సాగుతుంది. కోర్టు రూమ్ డ్రామా బాగానే రాసుకున్నా ఇటీవలి కాలంలో ఇలాంటివి చాలా చూసేశారు, కాబట్టి ఆడియన్స్ కి ఎలాంటి ప్రత్యేకత అనిపించదు. జైదీప్, శర్వారిలు మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగా జునైద్ జస్ట్ పర్వాలేదనిపించారు. ఇక ఇంత బిల్డప్ ఇచ్చిన మహరాజ్ చివరికి నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఇక అమీర్ ఖాన్ కొడుకు తొలి సినిమానే నిరాశనే మిగిల్చగా, రెండో సినిమాతో ఏమైనా జాగ్రత్త పెడతారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు