Avesham on OTT : ఆవేశం మూవీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…. మరో భాషలోనూ అందుబాటులోకి

Aavesham on OTT : మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆవేశం. థియేటర్లో సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఇప్పటిదాకా కేవలం మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ ఓటిటిలో మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కాబోతోంది.

మరో భాషలోనూ ఆవేశం స్ట్రీమింగ్

ఏప్రిల్ 11న ఆవేశం మూవీ మలయాళంలో థియేటర్లలో సందడి చేసింది. ఒకే భాషలో రిలీజ్ అయినప్పటికీ ఈ మూవీ 160 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి 2024లోనే భారీ కలెక్షన్స్ ఆబట్టిన మలయాళం మూవీగా రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకున్న తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ సిద్ధమైంది. ఏ భాషలో రిలీజ్ అయిన సినిమానైనా సరే హిట్ టాక్ వస్తే ఓటిటిలో అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తారన్న విషయం తెలిసిందే. కానీ ఆవేశం మూవీని మాత్రం కేవలం మలయాళంలో రిలీజ్ చేసి మూవీ లవర్స్ కు షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మూవీ లవర్స్ డిమాండ్ మేరకు ఈ మూవీని తమిళంలో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా సమాచారం.

Aavesham Talk: Pushpa's Bhanwar Singh Delivers Big!

- Advertisement -

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆవేశం మూవీ మే 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓటితిలో  కూడా ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అయితే ఓటిటిలో రిలీజ్ అయిన నెల రోజుల తరువాత ఈ సినిమా తమిళ వెర్షన్ ను రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్. దీంతో తమిళ తంబీలు ఈ సినిమాను తమ సొంత భాషలో చూసి ఎంజాయ్ చేయవచ్చని సంతోష పడుతున్నరు. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆ అవకాశం లేదు.

తెలుగు ప్రేక్షకుల సంగతేంటి?

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రిమింగ్ అవుతున్న ఆవేశం మూవీని అన్ని భాషల ప్రేక్షకులు చూడాలని ఆశపడుతున్నారు. కానీ మూవీ కేవలం మలయాళంలో మాత్రమే ఉండడంతో ప్రైమ్ వీడియోకు కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. తమ భాషలో కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలని భారీ సంఖ్యలో డిమాండ్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రైమ్ వీడియో జూన్ 21 నుంచి ఈ మూవీ తమిళ వెర్షన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుందని తెలుస్తోంది. అయితే తెలుగు మూవీ లవర్స్ కి మాత్రం ఆడియో వర్షన్ విషయంలో నిరాశ తప్పేలా కనిపించట్లేదు. అసలు ఆవేశం మూవీ తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

నిజానికి తెలుగు లో ఆవేశం మూవీని రిలీజ్ చేస్తే ఓటిటి లో ఈ మూవీ రికార్డులు కొల్లగొడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా ఈ విషయంపై దృష్టి పెట్టినట్టుగా కనిపించట్లేదు. ఇప్పటికే థియేటర్లలో ఈ మూవీ రిలీజై మూడు నెలలు దాటుతోంది. ఓటీటీలోకి వచ్చి నెల పూర్తయ్యింది. మరి ఇంకెన్ని నెలలు టైం తీసుకుని ఆవేశం మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేస్తారో అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు