Aay : “ఆయ్” సినిమా ఓటిటి డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Aay : టాలీవుడ్ లో గత నెల పంద్రాగస్టుకు పలు క్రేజీ చిత్రాలు విడుదల కాగా అన్ని సినిమాలు డిజాస్టర్ అయాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల మధ్యలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమా “ఆయ్”. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు (Bunny vas) నిర్మించగా, కొత్త దర్శకుడు అంజి.కె. మణిపుత్ర డైరెక్ట్ చేసాడు. ఇక ఈ సినిమా లో నార్నే నితిన్ (Narne Nithin), నయన్ సారిక జంటగా నటించగా, వినోద్ కుమార్, మైమ్ మధు, కసిరెడ్డి రాజ్‌కుమార్, అంకిత్ కోయా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పెద్దగా అంచనాలు లేకుండా తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేసింది.

Aay movie is streaming on Netflix OTT from September 12

చిన్న సినిమా, పెద్ద విజయం…

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఆయ్ (Aay) సినిమా అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేసింది. పెద్ద సినిమాల మధ్య విడుదలైన ఈ సినిమా తక్కువ స్క్రీన్ లలో రిలీజ్ కాగా, మౌత్ టాక్ తో థియేటర్లు పెంచుకుంటూ కలెక్షన్లలో గ్రోత్ చూపించింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద 16 కోట్లకి పైగా వసూళ్లు అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఇక ఈ సినిమాతో నార్నె నితిన్ రెండో సక్సెస్ ని అందుకోగా, బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా తాజాగా ఆయ్ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

- Advertisement -

ఆరోజునుండే ఆయ్ స్ట్రీమింగ్..

ఇక తాజాగా ఆయ్ సినిమా ఓటిటి రిలీజ్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఆయ్ సినిమా డిజిటల్ హాక్క్కులను ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ (Net Flix) వారు దక్కించుకోగా, ఈ సినిమా సెప్టెంబర్ 12నుండి స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించడం జరిగింది. ఇక ఆయ్ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం లో కూడా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఆయ్ సినిమా ఓటిటి లో రిలీజ్ అవుతుంది. మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఈ సినిమా ఓటిటి లో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు