Allu Aravind : డ్రీమ్ ప్రాజెక్ట్ లకు ముహుర్తం ఫిక్స్

మహా భారతం, రామాయణం అనేవి భారత దేశ ఇతిహాసాల్లో ఒక అద్భుతమనే చెప్పవచ్చు. పురాణ కథలను బట్టి వేద వ్యాసుడు అనే మహర్షి ద్వాపర యుగంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా మహాభారతం కథని రాశాడు. అదేవిధంగా రామయణంను వాల్మికి మహర్షి రాశాడు. రామాయణం అనగా రాముని నడక అని అర్థం. రామాయణం జరిగినప్పుడు వాల్మీకి జీవించే ఉన్నారు. చివరికి సీతమ్మ వాల్మికి ఆశ్రమంలోనే ఉన్నది. ఇలాంటి గొప్ప ఇతిహాస కథలతో సినిమాలను తెరకెక్కించాలని చాలా దర్శకుడు చెబుతూనే ఉంటారు.

గతంలో అగ్రదర్శకుడు రాజమౌళి కూడా మహాభారతం ఆధారంగా సినిమా తెరకెక్కించాలని కల కన్నాడు. కానీ అది ఇంకా ప్రకటించలేదు. ఇంతలోనే టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైనటువంటి అల్లు అరవింద్ ఓ ప్రకటన చేశాడు. మహాభారతం, రామాయణం తెరకెక్కించాలని అల్లు అర్జున్ కల అంట. మరోవైపు అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గీత అనే పేరు భగవద్గీతలోనేది అని ఇటీవలే ప్రకటించడం విశేషం. 

మహాభారతం కథ ఆధారంగా సినిమా తెరకెక్కించాలనేది ప్రతీ దర్శకుడి కల. తాజాగా అల్లు అరవింద్, మధు మంతెన కలిసి ప్రతిష్టాత్మకంగా మహాభారతం, రామాయణం నిర్మిస్తున్నారు. తొలుత మహాభారతంను సినిమాగా తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఇప్పుడు దీనిని వెబ్ సిరీస్ గా తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. పలు సీజన్లు రానున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేది డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. 2024లో ప్రారంభమవుతుందని ఓ సందర్భంలో స్వయంగా అల్లు అరవింద్ చెప్పాడని తెలుస్తుంది.  

- Advertisement -

ఇక రామాయణం గురించి అల్లు అరవింద్ ఇలా చెప్పాడని సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.  గత 3, 4 సంవత్సరాలుగా రామయణం గురించి చర్చ కొనసాగుతుంది. దాదాపు సంవత్సరంన్నర పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనికి మరో ఆరు నెలలు పట్టవచ్చు. 2023లో ప్రొడక్షన్ ప్రారంభమయ్యే అవకాశంది. భారతదేశంలోనే ఇది అత్యంత ఖరీదైన ఫిల్మ్ అవుతుంది అని అల్లు అర్జున్ స్వయంగా చెప్పడం విశేషం. దాదాపు 2500 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో విజువర్ వండర్ గా రామాయణం, మహాభారతంను నిర్మించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. భారతీయ అన్నీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రామయణం, మహాభారతం డీల్ చేసే దర్శకులు, హీరోల గురించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు