Amazon prime video : ప్రైమ్ వీడియోలో రాబోతున్న మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు ఇవే… అంతకంటే ముందు ఈ ప్రీక్వెల్స్ పై లుక్కేయండి

Amazon prime video : ప్రస్తుతం అమెజాన్, నెట్ ఫిక్స్ లాంటి దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఓటిటి సిరీస్ ల సందడి ఎక్కువవుతుంది. పలు సిరీస్ లకు మంచి ప్రేక్షకులను దక్కడంతో వరుసగా సీజన్ 1, 2, 3 అంటూ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. కాగా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొన్ని బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ల కొత్త సీజన్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. అయితే అంతకంటే ముందే ఈ ప్రీక్వెల్స్ పై లుక్కేయండి.

Panchayat Season 3 Released on Amazon Prime Video Today: How and Where to  Watch it Free on OTT?

పంచాయత్ సీజన్ 3

మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ అంటే ప్రస్తుతం పంచాయత్ సీజన్ 3 అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ కామెడీ డ్రామా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మే 28 నుంచి సీజన్ 3 తమిళ, తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో అందుబాటులోకి వచ్చేసింది. అయితే దీన్ని చూడడానికంటే ముందు పంచాయతత్ సీజన్ 1, సీజన్ 2పై ఓ లుక్కేస్తే స్టోరీ మరింత ఈజిగా అర్థమవుతుంది.

- Advertisement -

Honest Review and Rating: Mirzapur Season 2 – DiaryOfAnInsaneWriter

మీర్జాపూర్ సీజన్ 3

మీర్జాపూర్ సిరీస్ కి కరోనా టైంలో ఎంతటి ప్రేక్షకాదరణ దక్కిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే మీర్జాపూర్ సీజన్ 1, సీజన్ 2 కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సీజన్ 3 రిలీజ్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీజన్ వన్ లో శరత్ శుక్లా తెరవెనక తోలుబొమ్మగా నిలవగా, సీజన్ 2లో గుడ్డు సింహాసనాన్ని అదిరోహిస్తాడు. అయితే సీజన్ 3లో శరత్ పోటీలో చేరడానికి మరింత ఆకలితో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా సీజన్ 3 కూడా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నారు ప్రేక్షకులు. అయితే సీజన్ 3 వచ్చేలోపే మరోసారి సీజన్ , సీజన్ 2 ను చూసేస్తే రాబోయే కొత్త సీజన్ పై మరింత క్లారిటీ ఉంటుంది.

Paatal Lok season 2: Release date, cast, plot and more

పాతాళ లోక్ 2

కరోనా టైంలో హారర్ ప్రేక్షకుల ఆకలిని తీర్చడానికి వచ్చిన సిరీస్ పాతాళ లోక్. క్రైమ్ అండ్ హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన సీజన్ 1 ఆత్మహత్యలతో ముగిసింది. ఎన్నో ట్విస్టులతో నిండిన ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తిగా నడిచింది. ప్రస్తుతం సీజన్ 2 గురించి ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ ఇంకా సీజన్ 2 ప్రీమియర్ డేట్ ను వెల్లడించలేదు. అయితే ఈ సీజన్ 2020లో రిలీజ్ అయింది కాబట్టి అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవడానికి మరోసారి చూస్తే బెటర్.

Bandish Bandits: Amazon Prime Video's Anticipated Musical Drama Series -  Filme Shilmy

బందీష్ బండిట్ సీజన్ 2

మ్యూజిక్ నేపథ్యంలో తెరకెక్కిన బందీష్ సీజన్ 1కు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే సీజన్ 2 గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆనంద్ తివారి సీజన్ 2 కు దర్శకత్వం వహిస్తుండడం విశేషం. సీజన్ 2 వచ్చేలోపు మరోసారి సీజన్ 1 ను చూసేయండి.

Suzhal: The Vortex Review: Every Frame An Allegory, Every Actor In Their  Best Form, Pushkar & Gayatri Gave Tamil Industry A Visually Scintillating  Jewel

సుజల్ – ది వోర్టెక్స్ సీజన్ 2

సుజల్ సీజన్ 2 కూడా మోస్ట్ అవైటెడ్ అమెజాన్ వెబ్ సిరీస్ లో ఒకటి. సీజన్ 2లో నందిని కోర్టులో వాదించే లాయర్ హత్య చుట్టూ తిరుగుతుందని టాక్ నడుస్తోంది. అయితే అంతకంటే ముందే ఐశ్వర్య రాజేష్ నటించిన సుజల్ సీజన్ 1 చూస్తే సీజన్ 2 మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు