Anupama : బట్టర్ ఫ్లై నాకు పెద్ద సవాల్

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉంది. కార్తికేయ2, 18 పేజెస్ బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టిన తర్వాత స్లోగా సాగుతున్న అనుపమ సినిమా కెరీర్ ఊపందుకుంది. వీటితో అనుపమ సినిమాలపై, ఆమె ఎంచుకునే కథలపై ప్రేక్షకుల అభిప్రాయమే మారిపోయింది. ఇక నుంచి ఈమె నుంచి వచ్చే ప్రతి సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.

కార్తికేయ2, 18 పేజెస్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ చేస్తున్న తాజా చిత్రం బట్టర్ ఫ్లై. అనుపమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిహాల్, భూమికా చావ్లా, రావు రామేష్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. బట్టర్ ఫ్లై ఈ నెల 29న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన హాట్ స్టార్ లో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ప్రమోషన్ల భాగంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రం పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. “ఈ చిత్రం షూటింగ్ గతేడాది డిసెంబర్ లో ప్రారంభించాం. ఒక నెలలోనే పూర్తి చేశాం. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగాయి. దాదాపు ఏడాది పాటు నాణ్యతలో ఎలాంటి లోటు లేకుండా ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగాయి. ఈ చిత్రంలో నేను గీత అనే యువతి పాత్ర చేస్తున్నాను. ఈ పాత్ర చాలా భావోద్వేగభరితమైనది. అందుకే పాత్ర చేయడం నాకు ఒక పెద్ద సవాల్ గా మారింది. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గది. అందరికీ మంచి థ్రిల్ ను ఇస్తోంది” అంటూ అనుపమ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు