BloodyIshq : బోల్డ్ అందాలతో భయపెడుతూ రచ్చ చేయబోతున్న తెలుగు హీరోయిన్..!

BloodyIshq : టాలీవుడ్ లో ఉయ్యాలా జంపాల అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ ‘అవికా గోర్’. అంతకు ముందే బుల్లితెరపై సీరియల్స్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ భామ సినిమాల్లో మొదట్లో మంచిహిట్లతో దూసుకుపోయింది. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి హిట్లతో కెరీర్ లో వరుస అవకాశాలు అందుకుంది. బాలీవుడ్ కి చెందిన అమ్మాయి అయినా టాలీవుడ్ హీరోయిన్ గా చిన్న సినిమాల స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత వరుస ప్లాప్ లతో సతమతయింది. అందుకే ఇతర ఇండస్ట్రీలకు చెక్కేసింది. కానీ అక్కడ కూడా గుర్తింపు రాకపోవడంతో అన్ని ఇండస్ట్రీలలో వచ్చిన సినిమా వదలకుండా చేయాలనీ డిసైడ్ అయింది. ఇక తెలుగులో లాస్ట్ ఇయర్ ఓ ఓటిటి వెబ్ సిరీస్ చేయగా, ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Avika Gor's BloodyIshq movie will be streaming on July 26 on Hotstar

హార్రర్ సినిమాతో రాబోతున్న అవికా…

అయితే టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాక సతమతమైన అవికా గోర్, వెబ్ సిరీస్ లతో రచ్చ చేస్తుంది. లాస్ట్ ఇయర్ తెలుగులో వధువు అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని పలకరించింది. ఇక ఈ ఇయర్ బాలీవుడ్ లో బ్లడీ ఇష్క్ అనే సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా హారర్ సినిమాగా తెరకెక్కగా, ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 2024 జూలై 26న స్ట్రీమింగ్ కాబోతుంది. నిజానికి ఈ సినిమా థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నా మేకర్స్ అనివార్యకారణాల వల్ల ఓటిటి కి షిఫ్ట్ అయ్యారు. అయితే తెలుగులో స్ట్రామింగ్ అవుతుందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. ఇక బ్లడీ ఇష్క్‌లో వర్ధన్ పూరి, జెనిఫర్ పిచినాటో, శ్యామ్ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. హౌస్‌ఫుల్ మోషన్ పిక్చర్స్‌తో కలిసి హరే కృష్ణ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించారు.

- Advertisement -

బోల్డ్ అందాలతో రచ్చ చేయబోతున్న అవికా..

ఇక బ్లడీ ఇష్క్ చిత్రానికి ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాలో అవికా గోర్ (BloodyIshq) తన బోల్డ్ అందాలతో రచ్చ చేయబోతుందట. ఇంతవరకూ ఎప్పుడూ కనిపించనంత బోల్డ్ గా ఈ సినిమాలో అవికా గ్లామర్ షో చేయబోతుందని సమాచారం. ఇక అవికా గోర్ బ్లడీ ఇష్క్‌ తో పాటు అగ్లీ స్టోరీ, ఉమాపతి, షనుమ్క, బృందావన్, అమరన్ ఇన్ ది సిటీ: చాప్టర్ 1 వంటి వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టింది. అయితే ప్రస్తుతం బ్లడీ ఇష్క్ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది అవికా గోర్. మరి ఈ సినిమాతో మూవీ లవర్స్ ని ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు