Balagam: ఓటీటీలోనూ ట్రెండ్ సృష్టిస్తున్న సినిమా

నటుడు జబర్ధస్థ్ వేణు దర్శకుడి గా మారి తీసిన లేటెస్ట్ సినిమా బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ సమర్పణలో ఆయన కూతురు హర్షిత రెడ్డి నిర్మాత గా మారి తీసిన తొలి చిత్రం ఇది. ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించాడు. మార్చి 3 న ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన టాక్ తెచ్చుకొని సంచలన విజయం సాధించింది.

కేవలం 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మౌత్ టాక్ తో జనాల్లోకి ఎక్కేసింది. రోజు రోజుకి కలెక్షన్స్ ని పెంచుకుంటూ థియేటర్ల లో కొత్త సినిమాలు విడుదలైన కూడా కలెక్షన్స్ లో ఏమాత్రం తగ్గకుండా జోరు చూపించింది. ఇప్పటికే 20 కోట్లకు పైగా వసూలు చేసి ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో నిన్న అనగా 24 న విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లోనే టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో అత్యధికంగా వీక్షిస్తున్న సినిమాల్లో 5వ స్థానంలో కొనసాగుతుంది .

- Advertisement -

అయితే సినిమా విడుదలైన మూడు వారాలకే OTT లో స్ట్రీమింగ్ కి రావడం పట్ల ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రేక్షకులు ott లోనే చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని సినిమా ట్రెండ్ అవుతున్న దాన్ని బట్టి తెలుస్తుంది

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు