AHA OTT : బ్యాన్ చేసిన బోల్డ్ మూవీ ఆహా ఓటిటి లో రాబోతుంది..

AHA OTT : తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా వాడే ఓటిటి యాప్స్ లో “ఆహా” ఓటిటి కూడా ఒకటి. తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఈ యాప్ కే మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఇతర ఓటిటి ప్లాట్ ఫామ్ ల కన్నా తక్కువ ఖర్చు, అలాగే దాదాపుగా ఫ్యామిలీస్ తో కలిసి చూసే సినిమాలని, వెబ్ సిరీస్ లనే ఆహా లో వస్తూ ఉంటాయి. ఎక్కడో ఒకటి అరా రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగా ఉన్న చిత్రాలే కానీ, బోల్డ్ సినిమాలు అడల్ట్ సినిమాలైతే ఆహాలో రాలేదు. అయితే ఇప్పుడు ఆహ ఓటిటి లో ఫస్ట్ టైం ఒక బోల్డ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అది కూడా సెన్సార్ వాళ్ళు బ్యాన్ చేసిన సినిమా కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయ్.

Banned movie EVOL will be streaming on 15th August on Aha OTT

సెన్సార్ బ్యాన్ చేసిన మూవీ ఆహ ఓటిటి లో..

యోగి వెలగపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “ఎవోల్” (EVOL) . ఈ సినిమా పేరు వినడానికి విచిత్రంగా ఉన్నా, దీనికి అసలు టైటిల్ ‘లవ్’ (LOVE). ఇదే టైటిల్ ని రివర్స్ లో పెట్టి సినిమా తెరకెక్కించారు. ఇంతకు ముందు ట్రైలర్ తోనే వైరల్ అవగా, అందులోనే బోల్డ్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్ తో సినిమా హాట్ టాపిక్ అయింది. ఇక ఎవోల్ సినిమాలో సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా నటించగా, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‍ గా నటించింది. ఇద్దరు అబ్బాయిలతో ఒకేసారి అమ్మాయి రిలేషన్‍ లో ఉండే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను యోగి వెలగపూడి లవ్ పేరుతో బోల్డ్‌గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో అంతా కొత్త వారే నటించగా, ఎవోల్ సినిమాను యోగి వెలగపూడి స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించి, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రాసాడు.

- Advertisement -

ఆగష్టు 15 నుండే స్ట్రీమింగ్ కానున్న ‘ఎవోల్’…

ఇక “ఎవోల్” సినిమాను ముందుగా థియేటర్లలో రిలీజ్ చేద్దామని అనుకున్నా సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చేస్తూ రిలీజ్ కాకుండా, బ్యాన్ చేసారు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా ఆహా ఓటిటి (AHA OTT) లో ఎవోల్ సినిమాగా ఆగస్టు 15వ తేదీన స్ట్రీమింగ్‍ కానుంది. ఈ విషయాన్ని రీసెంట్ ఆ ఆహా ఓటిటి వారు అనౌన్స్ చేసారు. మరి ఇప్పటివరకూ ఒక రెస్పెక్టబుల్ మూవీస్ ని అందిస్తూ, తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న ఆహా ఓటిటి లో ఎవోల్ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు