Best Horror Movies on OTT : ఒంటరిగా మాత్రం ఈ సినిమాలు చూడకండి..

Best horror movies on OTT.. ఈ మధ్యకాలంలో సినీ ప్రేమికులు ఒకే తరహా సినిమాలు కాకుండా అన్ని జానర్లలో సినిమాలను ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ , హార్రర్ సినిమాలకే ఎక్కువగా ఓటు వేస్తున్నారని చెప్పవచ్చు. ఇక మీరు కూడా హారర్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నట్లయితే తాజాగా పలు ఓటీటీ ప్లాట్ఫారం ల వేదికగా వచ్చిన ఈ సినిమాలను మాత్రం దయచేసి ఒంటరిగా చూడకండి.. క్షణక్షణం భయాన్ని పుట్టించే ఆ చిత్రాలు ( Best Horror Movies on OTT ) ఏంటో ఇప్పుడు చూద్దాం..

ది మీడియం :

Best Horror Movies on OTT the Medium
Best Horror Movies on OTT the Medium

పంచోంగ్ పిసంటనాగన్ దర్శకత్వం వహించిన చిత్రం ది మీడియం.. 2021 లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా హడలెత్తించింది. థాయిలాండ్ లోని ఒక చిన్న గ్రామంలో నివసించే యువతి అతీంద్రియ శక్తితో బాధపడి.. ఆమె జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కొంటుంది అనేదే కథ.. ఈ సినిమా మొదట చాలా క్యాజువల్ గా ప్రారంభమైనప్పటికీ.. నెమ్మదిగా మిమ్మల్ని భయపెడుతుంది.. ఒక్కో సన్నివేశం వస్తుంటే మీలో దడ పుడుతుంది.. ఊహించని మలుపులు , భయానక సన్నివేశాలు, వాస్తవిక నటన మిమ్మల్ని అతీంద్రియ ప్రపంచానికి తీసుకెళ్తాయి అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో మీరు చూడవచ్చు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒంటరిగా చూడకండి.

ది వైలింగ్ :

Best Horror Movies on OTT The wailing
Best Horror Movies on OTT The wailing

దక్షిణ కొరియాలోని ఒక గ్రామంలో సడన్గా ఒక మర్మమైన వ్యాధి వ్యాప్తి చెందుతుంది.. దీంతో ప్రజలు కూడా చనిపోవడం ప్రారంభిస్తారు.. దీనికి కారణం తాజాగా ఆ ఊరికి వచ్చిన బోధకుడు అని అందరూ అనుకుంటారు.. అయితే విచారణలో ఆ వ్యక్తి అన్నింటికీ కారణం కాదు అని తేలిపోతుంది ..ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.. తన కూతురి అతేంద్రియ ప్రభావానికి కారణాన్ని అన్వేషించే తండ్రి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ, పోరాటం, పోలీస్ డ్యూటీ, ఎడతెగని మిస్టరీ వంటి ఉత్కంఠ భరితమైన కథాంశంతో వచ్చిన ఈ బెస్ట్ హార్రర్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. అడుగడుగునా భయానక సన్నివేశాలతో మిమ్మల్ని మరింత భయపెడుతుందని చెప్పవచ్చు.

- Advertisement -

మంత్రగత్తే (విచ్) :

Best Horror Movies on OTT Witch
Best Horror Movies on OTT Witch

రాబర్ట్ ఎగ్గర్స్ దర్శకత్వం వహించిన విచ్ చిత్రం 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1630 వ సంవత్సరంలో ఒక జంట 5 మంది పిల్లలతో ఇంగ్లాండ్ లోని ఒక అడవికి సమీపంలో నివసిస్తూ ఉంటారు. వారి ఆరవ సంతానం మరణిస్తుంది.. అంతేకాదు వారి పశువులు కూడా రహస్యంగా చంపబడతాయి.. దీనికి కారణం ఏంటి అనేది ఆ చిత్ర కథాంశం.. ఇతివృతం పాత్రలు అన్నీ కూడా మిమ్మల్ని 1630 వ సంవత్సరానికి తీసుకెళ్తాయి.. రహస్య మరణాలు, భయంకరమైన దృశ్యాలు, వెంటాడే సంగీతం మిమ్మల్ని భయానకానికి గురిచేస్తాయి.. ఇక మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో మిమ్మల్ని భయపెడుతుంది ఈ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

మిడ్ సమ్మర్ :

Best Horror Movies on OTT Mid Sommar
Best Horror Movies on OTT Mid Sommar

ఆరి ఆస్టర్ దర్శకత్వం వహించిన చిత్రం మిడ్ సమ్మర్.. 2019లో వచ్చింది ఈ చిత్రం.. వేసవిని గడపడానికి కొంతమంది స్నేహితులు ఒక స్పీడిష్ గ్రామంలో జరిగే సాంప్రదాయ పండుగకు వస్తారు. అందమైన పచ్చదనంతో తమను ప్రేమగా చూసుకునే బంధువులతో మధురంగా మొదలైన వారి వేసవి సెలవుల కాలం మెల్లగా నరకంగా ఎలా మారుతుంది అనేది ఈ చిత్ర కథాంశం.. అమానుషం , క్రూరత్వం లాంటి ఎలిమెంట్స్ తో థ్రిల్ కి గురిచేస్తుంది ఈ సినిమా.. అంతే కాదు భయపెట్టిస్తూ మంచి కిక్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ చిత్రం ఆపిల్ టీవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు