OTT Movie : సైలెంట్ గా ఓటిటీలోకి వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్… ఎక్కడ చూడొచ్చు అంటే?

OTT Movie : మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఏ అంచనాలు లేకుండా థియేటర్లలో సందడి చేసింది ఈ మూవీ. బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులను విశేషంగా అలరించి అనతి కాలంలోనే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని సినిమాలు థియేటర్లో సందడి చేస్తూ ఓటిటిలో కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి. అలాంటి కోవకు చెందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటిటిలో ఈ వారం స్ట్రీమింగ్ అవుతోంది.మరి ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ ని ఎక్కడ చూడచ్చో, స్టోరీ ఏమిటో ఓ లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు మరేమిటో కాదు కన్నడ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ భీమా. దునియా విజయ్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకొని మల్టీ టాలెంటెడ్ హీరో అనిపించుకున్నారు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవటంతో ఆల్రెడీ ఇండస్ట్రీ లో వున్న దర్శకులకు దునియా విజయ్ గట్టి పోటీని ఇవ్వబోతున్నారు అంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఆయన అభిమానులు. 8 కోట్ల బడ్జెట్ తో భీమా మూవీని తెరకెక్కించి 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 9న థియేటర్స్ లో రిలీజ్ అయి ప్రేక్షకులను మెప్పించడంతో పాటు అతి తక్కువ వ్యవధిలోనే ఓటీటీ వీక్షకులను ఎంటర్టైన్ చేయడానికి డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో వుంది. రెగ్యులర్ గా హారర్ థ్రిల్లర్, రొమాంటిక్ జానర్ల సినిమాలను చూసి విసిగిపోయిన వారికి ఇదొక బెస్ట్ మూవీ సజేషన్. మామూలు కమర్షియల్ యాక్షన్ మూవీ నే అయినప్పటికీ యాక్షన్ మూవీ లవర్స్ కి తప్పకుండా నచ్చుతుంది.

Duniya Vijay Starrer Bheema Gets 'A'Certificate, To Release On August 9 | Times Now

- Advertisement -

స్టోరీ విషయానికొస్తే..

ఈ సినిమాలో భీమా పాత్రలో గ్యాంగ్ స్టర్ గా దునియా విజయ్ అలరిస్తాడు. యాక్షన్ మూవీ లవర్స్ కు ఇదొక పక్కా ఐ ఫీస్ట్ లాంటి సినిమా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అసలు విషయం లోకి వెళితే గ్యాంగ్ స్టర్ అయిన హీరో తన జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటనతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఒక మెకానిక్ షాప్ పెట్టుకుని సాధారణ వ్యక్తిగా జీవిస్తూ ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో బ్లాక్ డ్రాగన్ అనే రౌడీతో హీరో డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగే యాక్షన్స్ సన్నివేషాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. భీమా గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది ? గ్యాంగ్ స్టర్ అయిన హీరో సాధారణ జీవితం ఎందుకు గడుపుతున్నాడు? బ్లాక్ డ్రాగన్ అనే రౌడీ ని ఎలా ఎదుర్కున్నాడో తెలుసుకోవాలంటే దునియా విజయ్ నటించిన భీమా మూవీని అమెజాన్ ప్రైమ్ లో వీక్షించండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు