Bigg Boss OTT 3: 4 వారాలే.. వీరి క్రేజ్ చూస్తే షాక్..!

Bigg Boss OTT 3.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎక్కడో పాశ్చాత్య దేశానికి చెందిన ఈ షో ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో సీజన్లు పూర్తి చేసుకుంటూ అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలను తీసుకువచ్చి దాదాపు 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఒకే హౌస్ లో బంధించి వారి హావభావాలను బయటకు తెప్పించడమే కాదు వారి ప్రవర్తనను ఆడియన్స్ కు పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు షో నిర్వహకులు.

Bigg Boss OTT 3: 4 weeks only.. Shocking to see their craze..!
Bigg Boss OTT 3: 4 weeks only.. Shocking to see their craze..!

ఫైనల్ కు చేరుకున్న బిగ్ బాస్ ఓటీటీ 3..

అందులో భాగంగానే ఈ షో కొంతమందికి మాత్రం ఉపయోగపడితే మరికొంతమందికి నెగిటివిటీని మూట కట్టిందనే చెప్పాలి. అయినా సరే ఈ షో చూసే వారి సంఖ్య ఎక్కువే.. ఇందులో పాల్గొనే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఎందుకంటే బిగ్ బాస్ నిర్వహకులు ఆఫర్ చేసే రెమ్యూనరేషన్ అలాంటిది మరి.. పైగా ఆడియన్స్ కి మంచి వినోదం కూడా. ఇకపోతే తెలుగులో ఏడు సీజన్లు పూర్తిచేసుకుని , 8 సీజన్ కి సిద్ధం అవుతూ ఉండగా.. ఇప్పుడు బాలీవుడ్లో ఏకంగా 18 వ సీజన్ కొనసాగుతోంది. ఓటీటీలో మూడవ సీజన్ గా జరుగుతోంది. ఈ 3వ సీజన్ కి కేవలం నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. టాప్ 3 లో ఉన్న సెలెబ్రిటీల గురించి, వారి క్రేజ్ గురించి తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే . త్వరలో గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. దానికి ముందు రోజు… షో లో అత్యంత ప్రజాదారణ పొందిన పోటీదారుల గురించి AV కూడా వేయబోతున్నారు. మరి లిస్టులో ఎవరెవరు ఫైనల్ కు చేరుకున్నారు..? వారి క్రేజ్ ఆడియన్స్ లో ఎలా వుంది.? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

టాప్ 3 వీరే..

సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 18 కి కౌంట్ డౌన్ సూచిస్తూ ఆగస్టు 4 2024న గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. గ్రాండ్ ఫినాలే కి ముందు మిగిలిన కంటెస్టెంట్ లలో అర్మాన్ మాలిక్, కృతిక మాలిక్, రణబీర్ షో రే, లవ్ కేశ్ కటారియా, విశాల్ పాండే, శివాని కుమారి, నేజీ, సన మక్బుల్ మరియు సాయికేతన్ రావు మిగిలారు.. ప్రస్తుతం ట్రోఫీపై దృష్టి పెట్టారు.. ఈ షోలో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలవబోతున్నారు అనే విషయానికి వస్తే.. అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన పోటీదారుగా లవ్ కేశ్ కటారియా నిలిచారు. సనా మక్బూల్ రెండవ స్థానంలో నిలవగా, పాపులారిటీ ట్రెండులో టాపర్గా రాపర్ నేజీ మూడో స్థానంలో నిలిచారు. ఇకపోతే విశాల్ పాండే, సాయికేతన్ రావు, రణవీర్ షోరే, శివాని మాలిక్, అర్మాన్ మాలిక్ , కృతిక మాలిక్ తర్వాత స్థానాలలో నిలిచారు. మొత్తానికైతే ఈ ముగ్గురు ఇప్పుడు ఫైనల్ కి చేరుకోబోతున్నారు. మరి ఈ ముగ్గురి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.. నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఉత్కంఠత రేకెత్తిస్తున్నారు. మరి ఈ ముగ్గురిలో నంబర్ వన్ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు