Abhishek Bachchan : అమ్మ ఈ సిరీస్ ను చూడదు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం వరుసగా ఓటీటీలో వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఇప్పటికే ఈయన ‘బ్రీత్ ఇన్ టు ది షాడోస్’ అంటూ ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేశారు. ఇప్పుడు దీనికి సీక్వేల్ గా మరో వెబ్ సిరీస్ లో నటించారు. ఈ కొత్త సీజన్ నవంబర్ 9 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.

‘బ్రీత్ ఇన్ టు షాడోస్’ మొదటి భాగాన్ని తెరకెక్కించిన మయాంక్ శర్మనే ఈ రెండో సీజన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లతో వస్తున్న ఈ రెండో సీజన్ లో అభిషేక్ బచ్చన్ తో పాటు నిత్యామీనన్, అమిత్ సాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న నేపథ్యంలో హీరో అభిషేక్ బచ్చన్ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా అభిషేక్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను నటించిన బ్రీత్ ఇన్ టు ది షాడోస్ సిరీస్ ను అతని తల్లి, నటి జయ బచ్చన్ చూడరని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. మొదటి సీజన్ కూడా జయ బచ్చన్ కు నచ్చలేదని వివరించారు. ఆమెకు ఇంతలా వయోలెన్స్ ను చూడలేరని చెప్పుకొచ్చారు. కానీ అతని తండ్రి అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ సీజన్ ను చాలా ఇష్టంగా చూస్తారని తెలిపారు. మొదటి సీజన్ బిగ్ బి చాలా నచ్చిందని కూడా అభిషేక్ వివరించారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు