Sasimadhanam OTT : కడుపు చెక్కలయ్యేలా నవ్వించే కామెడీ వెబ్ సిరీస్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sasimadhanam OTT : ఈ మధ్య ఓటీటీలో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. అడియన్స్ పల్స్ కనిపెట్టేసిన మేకర్స్ నిత్యం ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్, మర్డర్ మిస్టరీ కంటెంట్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇటీవల ఓటీటీలో ఎక్కువగా అలాంటి సినిమాలే విడుదల అవుతున్నాయి. మంచి సక్సెస్ ను అందుకుంటున్నాయి.. తాజాగా మరో రొమాంటిక్ కామెడీ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది..

తాజాగా ఓటీటీలోకి ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ రాబోతుంది. అదే శశిమథనం. బుల్లితెరపై తనదైన పంచులతో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనియా సింగ్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుంది.. అలాగే పవన్ సిద్ధు, కీర్తి, రూపలక్ష్మి, కృతిక, అశోక్ చంద్ర, కేశవ్ దీపక్, అవంతి దీపక్ వంటి యాక్టర్స్ ప్రత్యేక పాత్రల్లో నటించారు… ఈ సిరీస్ కు వినోద్ గాలి దర్శక్తవం వహించగా, ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ వెబ్ సిరీస్ రాబోతుంది..

Comedy web series Sasi Madhanam coming to OTT streaming
Comedy web series Sasi Madhanam coming to OTT streaming

మొన్నామధ్య విడుదలైన సిరీస్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. టీజర్ మొత్తం నవ్వులు పూయించింది.. టీజర్ తో సిరీస్ పై అంచనాలు భారీగా పెరిగాయి.. ఈ సిరీస్ ను జూలై 4 న స్ట్రీమింగ్ చేయబోతున్నారు.. సరికొత్త కథ తో ఈ సినిమా రాబోతుంది.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ‘దాగుడు మూతలు దండాకోర్‌.. ఎక్కడి ప్రేమికులు అక్కడే గప్‌చుప్‌.. అంటూ స్ట్రీమింగ్ డేట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది ఈటీవీ విన్. సాయి ధరమ్ తేజ్ నటించిన విరాట పర్వంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.. గతంలో యూట్యూబ్ లో షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం వరుసగా సినిమాలను కూడా లైన్లో పెట్టుకుంటుంది.. త్వరలో స్టార్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని టాక్

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు