IC814 : వెబ్ సిరీస్ మేకర్స్ పై ఫైర్ అయిన రియల్ ఫైలెట్ కెప్టెన్ దేవి శరణ్..

IC814 : బాలీవుడ్ లో రీసెంట్ గా “IC 814 ది కాంద‌హార్ హైజాక్” (IC814 The Kandahar Hijack) అనే వెబ్ సిరీస్ తెరకెక్కిన విషయం తెలిసిందే. అనుభ‌వ్ సిన్హా దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా, సిరీస్ మొత్తం సీరియస్ కథాంశం, గ్రిప్పింగ్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సిరీస్ లో నజిరుద్దీన్ షా, పంకజ్ కపూర్, విజయ్ వర్మ(Vijay Varma), అరవింద్ స్వామి లాంటి స్టార్ క్యాస్ట్ కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్ గా ఆగష్టు 29న ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ భారీ వ్యూయర్ షిప్ ని రాబడుతుంది. ఇక 1999 లో కాందహార్ హైజాక్ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా “IC 814 ది కాంద‌హార్ హైజాక్” సీరిస్ తెరకెక్కగా గత కొన్ని రోజులుగా ఈ సిరీస్ పై తీవ్ర దుమారం రేగుతుంది. ఈ సిరీస్ ని బ్యాన్ చేయాలనీ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Criticism on 'IC814 The Kandahar Hijack' Movie Makers

మేకర్స్ పై ఫైర్ అయిన రియల్ ఫిలెట్..

ఇదిలా ఉండగా తాజాగా కాందహార్ హైజాక్ సమయంలో ఫ్లైట్ నడిపిన రియల్ ఫైలెట్ కెప్టెన్ దేవి శరణ్ (Devi Saran), ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించిన చిత్ర యూనిట్ పై మండిపడ్డారు. సిరీస్ లో చాలా వరకు తప్పులు చూపించారని, అన్నిటికి మించి రెండు తప్పుల గురించి చెప్తూ మేకర్స్ పై మండిపడ్డాడు. అదేంటంటే.. ఈ వెబ్ సిరీస్ లో చూపించినట్టు విమానానికి ఫ్లంబింగ్ లైన్లను రిపేర్ తాను రియల్ గా చేయలేదని, అయితే అవి ఉగ్రవాదులకు ఎక్కడుంటాయో తెలియలేదు కాబట్టి, తాను విమానం హోల్డ్ లోకి తీసుకెళ్లానని చెప్పుకొచ్చాడు. అలాగే అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ తమకు సెల్యూట్ చేయలేదుగాని, తమకు బాగా సహకరించారని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాలో వక్రీకరించిన కొన్ని సీన్లను వెంటనే తొలగించాలని, లేదా బ్యాన్ చేయాలనీ చెప్పుకొచ్చాడు. అలాగే హైజాక్ జరిగిన సమయంలో ఒక ప్రయాణికుడిని కూడా చంపేశారని, ఇందులో కాస్త మార్చి చూపించారని దేవి శరన్ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

బ్యాన్ చేసి తీరాల్సిందే.. దిగొచ్చిన నెట్ ఫ్లిక్స్..

అయితే 1999 లో “కాందహార్ హైజాక్” (Kandahar Hijack) సంఘటన ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కగా, ఈ సిరీస్ లో పలు వివాదాస్పద అంశాలని వక్రీకరించి చూపించారని, నెట్టింట ఆడియన్స్ ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. భారత ఆర్మీ కి సంబంధించి సీక్రెట్ గా ఉంచాల్సిన కొన్ని అంశాలను, అజిత్ దోవ‌ల్ ఆధ్వ‌ర్యంలోని NSA చ‌ర్య‌ల వెన‌క కొన్ని రాజ‌కీయ కార‌ణాల‌ను ఈ సిరీస్ లో బహిర్గతం చేసారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా 1999 లో హైజాక్ లో ఉగ్రవాదులైన హైజాకర్ల పేర్లు ఈ సిరీస్ లో మార్చేసారు. వారి అసలు పేర్లు ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్, సన్నీ అహ్మద్, జహూర్ మిస్త్రీ అని ఉండగా, ఈ సిరీస్ లో శంకర్, భోలా అనే పేర్ల‌ను వాడి వక్రీకరించరించారని, హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ (Net flix) సంస్థ దీనిపై దిగొచ్చి, ఇలాంటి తప్పులు మళ్ళీ జరగవని, వెబ్ సిరీస్ ని పరిశోధించి చర్యలు చేపడతామని నెట్ ఫ్లిక్ సంస్థ కేంద్రానికి హామీ ఇచ్చినట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు