Hanuman OTT : తెలుగు వెర్షన్ లో 8 నిమిషాల మూవీ మిస్… ఏమైందంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “హనుమాన్” మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. రావడం అయితే వచ్చింది కానీ తెలుగు, హిందీ వెర్షన్ల మధ్య ఉన్న తేడా కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. హిందీ వర్షన్ తెలుగు వర్షన్ కంటే దాదాపు 8 నిమిషాల పాటు ఎందుకు ఎక్కువగా ఉంది? అనే ప్రశ్న తెలుగు సినీ ప్రియుల మైండ్ ను తొలిచేస్తుంది. మరి హనుమాన్ తెలుగు ఓటీటి వెర్షన్ లో ఆ ఎనిమిది నిమిషాల సీన్లు కట్ చేశారా? అసలు ఈ తేడా ఎందుకు వచ్చింది? అనే వివరాల్లోకి వెళితే…

సీన్స్ కట్ చేశారా?
2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాలు, వాటి మధ్య నెలకొన్న పోటీని తెలుగు సినీ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. ముఖ్యంగా చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన హనుమాన్ సక్సెస్ ను. జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించి, థియేట్రికల్ గా రిలీజై దాదాపు రెండు నెలలు దాటిన తరువాత ఓటిటి స్ట్రీమింగ్ మొదలైంది. ఎట్టకేలకు ఈనెల 17న అంటే ఆదివారం ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ముందుగా కేవలం హనుమాన్ హిందీ వర్షన్ ను మాత్రమే రిలీజ్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఇక హిందీ వెర్షన్ తో పాటే అదే రోజు టీవీలో కూడా హనుమాన్ టెలికాస్ట్ అయ్యింది. ఇంకేముంది ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ కావడానికి ఇంకా టైం పట్టేలా ఉందనుకున్నారు.

కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈనెల 17న తెలుగు వెర్షన్ ను కూడా ఓటిటిలో రిలీజ్ చేశారు. అనూహ్యంగా ఓటీటీలోకి వచ్చిన హనుమాన్ ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా థియేటర్ రన్ టైం కంటే ఓటిటి రన్ టైం 8 నిమిషాలు తక్కువగా ఉండడం పలు అనుమానాలను రేకెత్తించింది. కేవలం హిందీ వర్షన్ మాత్రమే థియేటర్ రన్ టైంతో మ్యాచ్ అవుతోంది. తెలుగు వెర్షన్ మాత్రం ఎనిమిది నిమిషాలు కట్ చేశారని టాక్ నడుస్తోంది. హిందీలో హనుమాన్ రన్ టైం 2 గంటల 38 నిమిషాలు ఉంటే, తెలుగు ఓటిటి వెర్షన్ లో మాత్రం 2 గంటల 30 నిమిషాలే ఉంది. మరి ఈ తేడాకు కారణం ఏమిటంటే ఫ్రేమ్ రేట్ లో వచ్చిన మార్పుల వల్లే 8 నిమిషాల నిడివి తగ్గిందని తెలుస్తోంది. తెలుగు వెర్షన్ మైక్రో సెకండ్ ల తేడాతో వేగంగా రన్ అవ్వడం వల్ల ఎనిమిది నిమిషాలు తేడా వచ్చినట్టు సమాచారం. అంతేగాని సినిమాలో సన్నివేశాలు ఏమి కట్ చేయలేదని తెలుస్తోంది.

- Advertisement -

102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్
ఇక ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హనుమాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది. జియో సినిమాలో హిందీ వెర్షన్ అందుబాటులోకి వచ్చిన ఒక రోజు తర్వాతే, జీ5 ఓటిటిలో తెలుగులో హనుమాన్ స్ట్రీమింగ్ మొదలైంది. థియేటర్లలో రికార్డులను బ్రేక్ చేసిన హనుమాన్ ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము రేపుతుండడం విశేషం. కేవలం రిలీజ్ అయిన 11 గంటల్లోనే హనుమాన్ మూవీ 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటిందని జి5 ఓటిటి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంతేకాకుండా గ్లోబల్ గా హనుమాన్ టాప్ వన్ లో ట్రెండ్ అవుతుండడం విశేషం. త్వరలోనే హనుమాన్ కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. హనుమాన్ హిందీ ఓటిటి వెర్షన్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు