Ahimsa : ఈ హింస ఓటిటిలో కూడానా ? రెస్పాన్సిబిలిటీ మీదే ఆడియన్స్

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి అభిరామ్ ఫస్ట్ మూవీ “అహింస” ప్రేక్షకులను హింస పెట్టడానికి ఓటీటీలోకి వచ్చేసింది.

టాలీవుడ్ టాప్ స్టార్ దగ్గుబాటి రానా సోదరుడు, టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ ఈ ఏడాది “అహింస” అనే మూవీతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించారు. ఎన్నో ఏళ్ల నుంచి హిట్ కోసం పరితపిస్తున్న తేజ ఈ మూవీతో హిట్ కొట్టాలని, దగ్గుబాటి అభిరామ్ కి స్టార్ గా లైఫ్ ఇవ్వాలని అనుకున్నారు. ఇక అభిరామ్ దగ్గుబాటి వారసుడు కావడం, తేజ మంచి డైరెక్టర్ కావడంతో సినిమాపై బాగానే అంచనాలు పెరిగిన నేపథ్యంలో జూన్ 2న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయింది. కానీ ఈ మూవీ కనీసం దగ్గుబాటి ఫ్యాన్స్ ని కూడా మెప్పించలేకపోయింది. థియేటర్లో ప్రేక్షకులని హింస పెట్టి, డిజాస్టర్ లిట్ లోకి వెళ్లిన ఈ మూవీకి కనీసం డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడు పోలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడిన ఈ “అహింస” మూవీ ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తేజ తెరకెక్కించిన “అహింస” మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన 6 నెలల తరువాత వ్యూయర్ షిప్ బేస్ మీద అమెజాన్ ప్రైమ్ వారికి ఇచ్చేశారు . అయితే ఈ మూవీ ఒక్క తెలుగు భాషలో మాత్రమే అందుబాటులో ఉండడం గమనార్హం. రఘు, అహల్య ప్రేమించుకుని నిశ్చితార్థం చేసుకుంటారు. అయితే అహల్యపై అత్యాచారం జరగడంతో రఘు న్యాయపోరాటానికి దిగుతాడు. అయితే అత్యాచారం చేసిన నిందితులు డబ్బు, అధికారం ఉండడంతో పవర్ ఫుల్ గా వుంటారు. మరి అంతటి పవర్ఫుల్ వ్యక్తులను రఘు ఎలా ఎదుర్కొంటాడు? ఈ పోరాటంలో రఘు గెలిచాడా లేదా అన్నదే అహింస మూవీ కథ. అయితే ఈ మూవీ ఓటీటీ లోకి వస్తున్నట్టుగా కనీసం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. ఎలాంటి హడావిడి లేకుండా, సైలెంట్ గా రిలీజ్ చేసేసారు.

- Advertisement -

రొటీన్ ఔటేటెడ్ కథతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను తీవ్రంగా నిరశపరిచింది. దగ్గుబాటి అభిరామ్ నటుడిగా పనికిరాడు అని పెదవి విరిచేశారు ప్రేక్షకులు. అలా నెగిటివ్ టాక్ తెచ్చుకొని ‘అహింస’ భారీ డిజాస్టర్ గా మిగలగా. ఈ మూవీలో అభిరామ్ సరసన గీతిక తివారి హీరోయిన్ గా నటించింది. ఇక థియేటర్లలో తలనొప్పి తీసుకొచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటిటీ వీక్షకులను హింసించడానికి వచ్చేసింది. మరి ఈ మూవీకి ఓటీటీ లవర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు