Comedy movie: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న కామెడీ మూవీ.. ట్రైలర్ రిలీజ్..!

Comedy movie: ప్రజెంట్ కాలంలో ఓటీటీల హడావిడి ఎక్కువగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే డైరెక్టర్లు సైతం తమ సినిమాని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలా ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

థియేటర్ల జోలికి వెళ్లకుండా చిన్న బడ్జెట్ సినిమాలు కొన్ని ఓటీటీలని నమ్ముకుంటున్నాయి. అటువంటిదే ఓ కామెడీ మూవీ కూడా. ప్రైమ్ వీడియోలోకి నేరుగా రాబోతుంది ఈ మూవీ. శర్మాజీ కి బేటీ అనే ఈ సినిమా ట్రైలర్ను బుధవారం అనగా జూన్ 19వ తారీఖున మేకర్స్‌ రిలీజ్ చేశారు. కామెడీ తో పాటు మహిళా సాధికారతపై ఓ సందేశాన్ని ఇస్తూ సాగిపోయే మూవీ ఈ చిత్రం.

Direct OTT attack comedy movie.. trailer release
Direct OTT attack comedy movie.. trailer release

ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్మ అనే ఇంటి పేరు ఉన్న ముగ్గురు మహిళలు, ఇద్దరూ బాలికలు చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ భార్య తాహిరా కశ్యప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాక్షి అండ్ సయామీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ముందుగా చెప్పినట్టే కామెడీ తో పాటు మహిళా సాధికారత గురించి నొక్కి చెప్పే సినిమాగా ఉండనుందని ట్రైలర్ చూస్తేనే స్పష్టంగా అర్థమైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు