OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న.. 12th ఫెయిల్ హీరో మూవీ..!

OTT: బాలీవుడ్ యువ నటుడు విక్రాంత్ కు మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీ దక్కింది. ఇక గత ఏడాది రిలీజ్ అయిన 12th ఫెయిల్ మూవీ అతడికి మంచి పేరును తెచ్చి పెట్టింది. ఈ చిత్రం హిట్ కాగా ఈ హీరో నటనపై ప్రశంసల వర్షం కురిసింది.

ఇక ఇప్పుడు విక్రాంత్ హీరోగా బ్లాక్ ఔట్ సినిమా రూపొందింది. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా కారారు అయింది. ఈ సినిమా జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో జూన్ 7వ తేదీన స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా టీజర్ నేడు అనగా మే 21న ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది జియో సినిమా.

direct-ott-attack-will-be-done-12th-fail-hero-movie
direct-ott-attack-will-be-done-12th-fail-hero-movie

ఇక ఈ మూవీ హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠ, బెంగాలీ భాషల్లో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్లు జియో సినిమా కన్ఫర్మ్ చేసింది. ఇక ఈ మూవీలో విక్రాంత్, మౌని రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎంత మేరా రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు