Double Ismart : ‘ డబుల్ ఇస్మార్ట్ ‘ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Double Ismart : టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబోలో డబుల్ ఇస్మార్ట్ సినిమా వచ్చింది. పూరీ జగన్నాథ్ ఎంతో కసితో ఈ సినిమా తీశాడు. ఫలితంగా అది సూపర్ హిట్ అయ్యింది. పూరీ అప్పులన్నీ తీర్చేసిన సినిమా అది. హీరో రామ్ మార్కెట్ ను కూడా రెండింతలు పెంచిన సినిమా అని చెప్పొచ్చు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఇద్దరూ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. ఈ సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది.. ప్రస్తుతం యావరేజ్ టాక్ ను అందుకుంది. ఇక తాజాగా ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా మణిశర్మ బాణీలు, కావ్య థాపర్ గ్లామర్ షో జనాల్లోకి భీభత్సంగా వెళ్లిపోయింది. సో, శంకర్ క్యారెక్టర్ ఆల్రెడీ మాస్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయింది.. ఇప్పుడు వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది. కానీ మొదటి రోజే నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ అవ్వక ముందు ఉన్న బజ్ ఇప్పుడు జనాల్లో కనిపించలేదు. అనుకున్న కలెక్షన్స్ రావడం కష్టమే అని సినీ క్రిటిక్స్ అభిప్రాయ పడుతున్నారు.. ఇక ఈ మూవీ ఓటీటీ అప్డేట్ కూడా తాజాగా వచ్చేసింది.

' Double Smart ' OTT platform fix.. Where is the streaming?
‘ Double Smart ‘ OTT platform fix.. Where is the streaming?

డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. నాలుగు నుంచి ఆరు వారాల తర్వాతే డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ మూడు లేదా నాలుగో వారంలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ మాస్ కమర్షియల్ మూవీ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాకు 33 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. రామ్ కెరీర్‌లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా రికార్డ్ నెలకొల్పింది. మరి అంత కలెక్ట్ చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు