Dune 2 OTT in Telugu : తెలుగులో హాలీవుడ్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ స్ట్రీమింగ్… ఏ ఓటిటిలో చూడొచ్చు అంటే?

Dune 2 OTT in Telugu : బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఎపిక్ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ డ్యూన్ 2 ఓటిటి రిలీజ్ కు ముహూర్తం ఖరారయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్ ను కొల్లగొట్టిన ఈ మూవీ ఓటీటీలో  తెలుగులో కూడా స్ట్రీమింగ్ కాబోతుండడం విశేషం. మరి ఈ మూవీని ఏ ఓటీటిలో ఎప్పుడు చూడొచ్చు? అనే వివరాల్లోకి వెళితే…

జియో సినిమాలో స్ట్రీమింగ్…

బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీ డ్యూన్ కు సీక్వెల్ గా తెరపైకి వచ్చింది డ్యూన్ 2. ఈ మూవీని భారీ అంచనాల మధ్య 2024 మార్చ్ 1న థియేటర్లలోకి తీసుకొచ్చారు మేకర్స్. ఊహించినట్టుగానే సినిమా ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది. తాజాగా ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జియో సినిమాలో ఆగస్టు 1 నుంచి డ్యూన్ 2 స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ అదే రోజున ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో కూడా జియో సినిమాలో అందుబాటులో ఉండబోతోంది.

రెండు ఓటిటిల్లో డ్యూన్ 2

అయితే ఇప్పటికే ఈ మూవీ రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు బుక్ మై షో ఓటిటిలో ఇంగ్లీష్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఈ రెండు ఓటీటీలలో కూడా ఈ సినిమా రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉండడం గమనార్హం. కానీ జియో ఓటీటీ ప్లాట్ఫామ్ లో మాత్రం రెంట్ కట్టే పని లేకుండానే డ్యూన్ 2 సినిమాను చూసే అవకాశాన్ని కల్పించబోతున్నారు. జస్ట్ ప్రీమియం ప్లాన్ ఉంటే చాలు సబ్స్క్రైబర్లు ఎలాంటి రెంట్ లేకుండానే ఆగస్టు 1 నుంచి జియో సినిమాలో డ్యూన్ 2 మూవీని చూడొచ్చు. కాగా జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ నెలకు కేవలం రూ.29 మాత్రమే. ప్రస్తుతానికి యాడ్స్ లేకుండానే ఈ ప్లాన్ తీసుకుంటే జియో సినిమాలో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా సినిమాలు చూడొచ్చు. కాబట్టి ఈ బిగ్గెస్ట్ హాలీవుడ్ మూవీ కారణంగా జియో సినిమాకు భారీ వ్యూస్ దక్కే అవకాశం ఉంది.

- Advertisement -

When Will Dune 2 Start Streaming Online? | The Direct

కలెక్షన్ల పరంగా దుమ్మురేపిన డ్యూన్ 2

డూన్ పార్ట్ 2 అనేది సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఇది 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ డూన్‌కి సీక్వెల్. ఈ మూవీ  1965లో రచయిత ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన డూన్ నవల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా కథ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది.  డ్యూన్ 2 మూవీలో జెండియా, తిమోతీ చాలమెట్, రెబకా ఫెర్గ్యూసన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఫ్లోరెన్స్ పగ్, డేవ్ బటిస్టా, క్రిస్టోఫర్ వాకెన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. డెనిస్ విలనోవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023లో విడుదల కావాల్సి ఉండగా రచయితల సమ్మె కారణంగా కాస్త ఆలస్యమైంది. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన డ్యూన్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 5940 కోట్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన సునామిన్స్ సృష్టించింది. నిర్మాతలకు భారీగా కాసుల వర్షం కురిపించింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు