Fahad Movie on OTT : లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న ఫహద్ మూవీ ఓటిటిలోకి… ఏడాది తరువాత మోక్షం

Fahad Movie on OTT : చాలా సినిమాలకు థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే పలు సమస్యల వల్ల 6 నెలల నుంచి ఏడాది ఆలస్యంగా ఓటీటీలోకి వస్తున్నాయి. తాజాగా ఫహాద్ నటించిన ధూమం మూవీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏడాది తరువాత ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు మోక్షం లభించింది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏడాది తరువాత ఓటీటీలోకి..

ప్రముఖ మలయాళ హీరో నటించిన మలయాళ సినిమా ధూమం. పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఫహద్ ‘అవినాష్’ పాత్రలో నటించాడు. కథానాయికగా అపర్ణా బాలమురళి నటించింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూ కూడా కీలక పాత్ర పోషించారు. ధూమంలో అచ్యుత్ కుమార్ వినీత్, అను మోహన్, జాయ్ మాథ్యూ, నందు, భానుమతి పయ్యన్నూరు, ఉమా, సంతోష్ కర్కి ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రీత జయరామన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. విజయ్ కిరగందూర్ హోంబాల ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించారు. 2023 జూలై 23న ధూమం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ಒಂದೇ ಟ್ವೀಟ್ ಮೂಲಕ ಎಲ್ಲಾ ಅನುಮಾನಗಳಿಗೆ ತೆರೆ ಎಳೆದ 'ಹೊಂಬಾಳೆ ಫಿಲ್ಮ್ಸ್'; ಮಹತ್ವದ ಘೋಷಣೆ - Kannada News | Hombale Films Announce Dhoomam Kannada version will be release on June 23 | TV9 Kannada

- Advertisement -

ఓటీటీ రిలీజ్ కు కష్టాలు

ధూమం సినిమాకు తెలుగు రిలీజ్ తో పాటు ఓటీటీ కష్టాలు కూడా బాగానే ఎదురయ్యాయి. చాలాకాలం వెయిటింగ్‌ తర్వాత యాపిల్ టీవీకి సంబంధించిన ఐట్యూన్స్‌లో విడుదలైంది. కానీ ఐట్యూన్స్‌లో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. రూ. 150 కడితే ఈ సినిమాను చూడొచ్చు. ధూమం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. కొన్ని అంతర్గత సమస్యల కారణంగా సినిమా ఓటీటీ విడుదల వాయిదా పడుతోందని అన్నారు.

అలాగే ఈ మూవీ తెలుగు రిలీజ్ కు కూడా చెప్పలేనన్ని కష్టాలు వచ్చాయి. ముందుగా తెలుగులో కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు. అందులో భాగంగానే గతేడాది ధూమం ట్రైలర్ ను తెలుగులో రిలీజ్ కూడా చేశారు. ఏమైందో తెలియదు కానీ ఈ మూవీ మలయాళంలో మాత్రమే రిలీజ్ అయ్యింది. రెండు నెలల క్రితం యూట్యూబ్ లో కూడా మలయాళంలోనే రిలీజ్ చేశారు, ఎట్టకేలకు ఏడాది తరువాత ఈ మూవీ తెలుగు రిలీజ్ కు మోక్షం దక్కింది. తాజాగా ఆహా ధూమం తెలుగు ఓటీటీ రైట్స్ ను దక్కించుకుంది. జూలై 11 నుంచి ఆహాలో ఈ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది.

కథలోకి వెళ్తే..

సిగరెట్ ను ముట్టుకొని హీరో తెలివి తేటలను ఉపయోగించి ఓ కంపెనీ సేల్స్ ను పెంచేస్తాడు. ఆ తరువాత కంపెనీ ఎండీతో వచ్చే బేధాభిప్రాయాల కారణంగా రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. తరువాత కారులో వెళ్తున్న హీరో, అతని భార్యను కిడ్నాప్ చేసి, ఆమె శరీరంలో ఒక మైక్రో బాంబ్ పెడతారు. అది పేలవద్దు అంటే చెప్పిన పనులన్నీ చేయమంటారు. కడుపుతో ఉందని కూడా చూడకుండా అతని భార్యతో సిగరెట్ తాగిస్తారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? చివరకు హీరో తన భార్యను కాపాడాడా అనేది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు