Free Netflix : నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్స్ కి ఇక పండగే… ఫ్రీ ఎప్పటి నుంచి అంటే..?

Free Netflix.. ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లలో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి.. ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ఉచితంగా అందనుందంటే.. ఆశ్చర్యపోతున్నారు కదా.. ఇది అక్షరాలా నిజం.. వాస్తవానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్, ఆహా, జీ 5, సోనీలివ్ , నెట్ ఫ్లిక్స్ ఇలా చాలా ఓటీటీ లు ఉన్నాయి. కానీ వీటన్నింటిలో డిమాండ్ కలిగింది మాత్రం కేవలం నెట్ ఫ్లిక్స్ మాత్రమే.. అయితే నెట్ ఫ్లిక్స్ షేరింగ్ కి సాధ్యం కాకపోవడంతో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే.. అలాంటి నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు ఫ్రీగా స్ట్రీమింగ్ అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు.

ఉచితంగా నెట్ ఫ్లిక్స్..

Free Netflix : Netflix fans are excited... Since when does free mean..?
Free Netflix : Netflix fans are excited… Since when does free mean..?

అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ త్వరలో ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.. యూజర్లు ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండానే ఉచితంగానే వీక్షించే అవకాశాన్ని కల్పించనున్నారు. అయితే కేవలం ప్రకటనల ద్వారానే ఆదాయం పెంచుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ దిశగా నెట్ ఫ్లిక్స్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ఫ్రీ స్ట్రీమింగ్ అందించవచ్చు అని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా ఆసియా, యూరప్ వంటి మార్కెట్లలో ఈ ఫ్రీ ప్లాన్ ప్రవేశపెట్టి.. ఆ తర్వాత త్వరలోనే మన భారత దేశంలో కూడా ఈ ఆఫర్ ని తీసుకురాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ప్లాన్ లో ప్రకటనలతో కూడిన స్ట్రీమింగ్ ఉంటుంది… నెట్ ఫ్లిక్స్ కి ఎక్కువ ప్రజాదరణ ఉన్న నేపథ్యంలో ఫ్రీగా అందిస్తే మరింత మంది వీక్షించే అవకాశం ఉందని.. తద్వారా రెవెన్యూ పెంచుకోవచ్చని కంపెనీ ఆలోచన చేస్తోందట.

రెవెన్యూ కోసమే ఫ్రీ ప్లానింగ్..

2021లో కెన్యాలో ఆండ్రాయిడ్ ఫోన్లో నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే ఈ తరహా ప్రయోగం చేసింది. అయితే గతేడాది ఈ ప్లాన్ నిలిపివేసింది. యూఎస్ లో మాత్రం ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్ ప్రవేశపెట్టే ఆలోచన తమకు లేదని తెలుస్తోంది. యూఎస్ లో నెట్ ఫ్లిక్స్ నెలకు రూ.600 ప్లాన్ బాగా సక్సెస్ అయ్యింది.. అందుకే ఈ ప్లాన్ చాలా మంది వినియోగిస్తున్నారు. ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్స్ ప్రవేశపెడితే వీక్షకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. తద్వారా రెవిన్యూ పెరుగుతుందని.. ఫలితంగా వీక్షకులు ఎంత ఎక్కువ మంది ఉంటే యాడ్స్ అన్ని ఎక్కువగా వస్తాయనే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ ఇలా పెంచుకునే ఆలోచనలో పడినట్లు సమాచారం. అందుకే నెట్ ఫ్లిక్స్ కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ఉచిత స్ట్రీమింగ్ ప్లాన్ అందించేందుకు సన్నహాలు కూడా చేస్తోంది. వచ్చే ఏడాది చివరికి ఆసియాలో ఈ ప్లాన్ ప్రవేశపెట్టి ఆ తర్వాత ఇండియాలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.. ఏది ఏమైనా ఈ ప్లాన్ తో వారు రెవెన్యూ పెంచుకున్నా.. చాలామందికి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఉచితంగా చూసే అవకాశం కలుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు