Gam Gam Ganesha OTT : నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Gam Gam Ganesha OTT : టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా తాజాగా నటించిన సినిమా గం గం గణేశా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా మే 31 న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.. ఆ సినిమా కామెడీ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఓ మాదిరిగా టాక్ ను అందుకుంది.. ఇప్పుడు నెలలోపే ఓటీటిలోకి రాబోతుంది..

ఆనంద్ దేవరకొండ గతంలో బేబీ మూవీతో కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ వంద కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ఎమోషనల్‌లో రోల్‌లో కనిపించిన ఆనంద్ దేవరకొండ గం గం గణేశాలో అందుకు పూర్తి డిఫరెంట్‌గా కామెడితో కడుపుబ్బా నవ్వించేశాడు.. ఈ మూవీ మే 31న థియేటర్లలో రిలీజైన గం గం గణేశా మూవీ ఇరవై రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చింది. ఈ క్రైమ్ కామెడీ మూవీ థియేటర్లలో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది..

gam gam ganesha movie ott update
gam gam ganesha movie in ott

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఆనంద ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తాడు.. టైటిల్ కు తగ్గట్లే సినిమా కొత్తగా ఉంటుంది.. హీరో ఈ సినిమాలో దొంగ పాత్రలో కనిపిస్తాడు.. అతని దగ్గర డబ్బులు లేవని ప్రేమించిన అమ్మాయి వదిలేసి పోతుంది.. లవ్ బ్రేకప్‌తో గణేష్ ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని ఫిక్సవుతాడు. ఏడు కోట్ల విలువైన ఓ వజ్రాన్ని దొంగతనం చేసే డీల్ కుదుర్చుకుంటాడు. గణేష్ దొంగతనం చేసిన ఆ వజ్రం అనుకోకుండా ఓ వినాయకుడి విగ్రహంలో పడిపోతుంది.. ఆ విగ్రహం  నుంచి వజ్రన్ని హీరో ఎలా కొట్టేశాడు అనేది సినిమా కథ.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక మందన్న భాగం కావడం, టీజర్స్‌, ట్రైలర్స్ కొత్తగా ఉండటంతో ఈ చిన్న సినిమా తెలుగు ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది.. మొత్తంగా చూసుకుంటే సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. మరి ఓటీటిలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు