Garudan : ఓటిటిలోకి వచ్చేసిన గరుడన్.. తెలుగులో ఎప్పుడు?

Garudan : ఈ ఏడాది లో కోలీవుడ్ లో పెద్దగా స్టార్ హీరోల సినిమాలేవీ సక్సెస్ కాలేదని తెలిసిందే. అన్ని చిన్న సినిమాలే సత్తా చాటగా అందులో “గరుడన్” సినిమా కూడా ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు వసూలు చేసింది. కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ అయిన సూరి ఈ సినిమాలో హీరోగా నటించడం విశేషం. ఇంతకు ముందు విడుదలై లో కూడా సూరి హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తమిళనాట మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి సీరీయస్ జోనర్ లోనే గరుడన్ సినిమాని కూడా తెరకెక్కించగా, మే31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. థియేటర్ల వద్ద దాదాపు ఈ సినిమా 60 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా తాజాగా ఓటిటి లో రిలీజ్ కావడం జరిగింది.

Garudan Movie streaming on Amazon Prime OTT

ప్రైమ్ లో గరుడన్…

ఇక సూరి నటించిన “గరుడన్” సినిమా ని RS దురై సెంథిల్ కుమార్ తెరకెక్కించగా, ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రానికి కథ అందించారు. ఇక డైరెక్టర్ కూడా వెట్రిమారన్ శిష్యుడే కావడం విశేషం. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా, ఈరోజు (జులై3) నుంచి ఈ చిత్రం తమిళ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయితే గరుడన్ సినిమా తమిళ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. చాలా మంది తెలుగు ప్రేక్షకులు తెలుగులో కూడా రిలీజ్ ఉంటుందని అనుకున్నారు. కానీ తమిళ్ లో మాత్రమే ఉంది. అయితే దీనికి కారణం ఉందని అంటున్నారు నెటిజన్లు.

- Advertisement -

తెలుగులో ఉంటుందా?

అయితే తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన గరుడన్ సినిమా ఓటిటి లో తమిళ్ లో మాత్రమే రిలీజ్ కాగా, తెలుగు రిలీజ్ ని కావాలని ఆపినట్లు టాక్ నడుస్తుంది. దానికి కారణం ఈ సినిమాని తెలుగులో పలువురు నిర్మాతలు రీమేక్ చేద్దామని అనుకుంటున్నారట. కానీ రేటు విషయంలో అటుఇటుగా ఉన్నారని తొందర్లోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందని సమాచారం. ఒకవేళ రీమేక్ ఎవరూ చేయకపోతే డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెర్షన్ కూడా త్వరలోనే స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం. ఇక గరుడన్ సినిమాలో సూరి తో పాటు మళయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా ముఖ్య పాత్రలో నటించగా, శశికుమార్, సముద్రఖని, వంటి పలువురు విలక్షణ నటులు కూడా కీలకపాత్రలో నటించారు. ఇక యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు