Godzilla Minus One on OTT : ఓటీటికి వచ్చేసిన గాడ్జిల్లా మూవీ… ఈ ఆస్కార్ విన్నింగ్ మూవీని ఎక్కడ చూడొచ్చు అంటే?

Godzilla Minus One on OTT : గాడ్జిల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ ఫ్రాంచైజీలలో ఒకటి. హాలీవుడ్‌తో పాటు జపాన్ ఫిల్మ్ మేకర్స్ కూడా గాడ్జిల్లా సినిమాలను చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2023 జపనీస్ బ్లాక్‌బస్టర్ ‘గాడ్జిల్లా మైనస్ వన్’ ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతోంది. ఎప్పుడు, ఎక్కడ ఈ కొత్త గాడ్జిల్లా మూవీని చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

సైలెంట్ గా ఓటీటీలోకి

దాదాపు ఆరు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ‘గాడ్జిల్లా మైనస్ వన్’ ఇప్పుడు ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళం ఇతర భాషలలో డబ్బింగ్ వెర్షన్‌తో పాటు జపనీస్ భాషలో అందుబాటులో ఉంది.

థియేటర్లలో రిలీజైన 6 నెలల తరువాత

తకాషి యమజాకి రచించి, దర్శకత్వం వహించిన ఈ జపనీస్ లైవ్-యాక్షన్ చిత్రం గాడ్జిల్లా. ఈ మొత్తం ఫ్రాంచైజీలో తాజాగా రిలీజైంది మాత్రం 37వ భాగం. ఎన్నో అంచనాల మధ్య, ‘గాడ్జిల్లా మైనస్ వన్’ నవంబర్ 2023లో జపాన్‌లో థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 1న యూఎస్ లో విడుదలైంది.

- Advertisement -

ఈ చిత్రంలో కోయిచి షికిషిమాగా ర్యునోసుకే కమికీ, నోరికో ఓషిగా మినామి హమాబే, షిరో మిజుషిమాగా యుకీ యమడతో పాటు ర్యూనోసుకే కమికి, మునెతక అయోకీ, హిడెటకా యోషియోకా, సకురా ఆండో, కురానోసుకే ససాకీ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. థియేటర్లలో రిలీజైన 6 నెలలకు ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ.

Godzilla Minus One Rotten Tomatoes Score Breaks Major Movie Record For  Franchise

గాడ్జిల్లా మైనస్ వన్ స్టోరీ

1945లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధానంతరం జపాన్‌లో నెలకొన్న పరిస్థితుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది ఈ మూవీ. ‘గాడ్జిల్లా’ అనే రాక్షసుడిని ఎదుర్కొన్న తర్వాత పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)తో బాధపడుతున్న కామికాజీ పైలట్ కథతో ఉంటుంది మూవీ. అణు బాంబుల ధాటికి హీరోషిమా, నాగసాకి ధ్వంసమైన బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన ఫిక్షనల్ స్టోరీతో, అబ్బుర పరిచే గ్రాఫిక్స్ తో అదిరిపోయే గాడ్జిల్లా మైనస్ వన్ మూవీని నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.

గాడ్జిల్లా మైనస్ వన్ సకలెక్షన్స్

అకాడమీ అవార్డు గెలుచుకున్న బ్లాక్‌బస్టర్ గాడ్జిల్లా మైనస్ వన్ కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా $116 మిలియన్లు వసూలు చేసింది. 2023లో జపాన్‌లో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. కలెక్షన్ల పరంగా అంతకుముందు 2016 లో రిలీజైన గాడ్జిల్లా మూవీ రికార్డును తిరగరాసింది.

గాడ్జిల్లా వివాదం

టోహో నిర్మించిన 33వ గాడ్జిల్లా చిత్రం షిన్ గాడ్జిల్లా 2016లో రిలీజ్ అయ్యింది. అది  విడుదలైన తర్వాత టొహో వివాదాల్లో చిక్కున్నాడు. దీంతో నెక్స్ట్ పార్ట్ తెరకెక్కించడానికి చాలా సమయం పట్టింది. ఆ వివాదం కారణంగా 2020 వరకు మరో లైవ్-యాక్షన్ మూవీని నిర్మించలేకపోయాడు. అయితేనేం గాడ్జిల్లా మైనస్ వన్ 2003లో రిలీజై ఆస్కార్ ఉం అందుకోవడమే కాకుండా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు