Wedding : నయన్ బాటలో ఆపిల్ బ్యూటీ

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హీరోయిన్ హన్సిక. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన క్యూట్ యాక్టింగ్ తో అందరినీ కట్టిపడేసింది. చిన్న వయసులోనే గ్లామర్ షో తో రచ్చ చేసిన హన్సిక ఆపిల్ బ్యూటీగా కూడా పేరుపొందింది. ఇప్పటికీ హన్సిక గ్లామర్ చూస్తే కుర్రకారులు సైతం మంత్రముగ్ధులవుతారు. ఇక కోలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటుంది.

అయితే హన్సిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. సోహల్ కతురియ అనే వ్యాపారవేత్తతో చాలాకాలంగా డేటింగ్ లో ఉన్న హన్సిక డిసెంబర్ 4వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న 450 ఏళ్ల చరిత్ర కలిగిన ప్యాలెస్ లో వీరి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

ఇదిలా ఉండగా ఈ బ్యూటీ మ్యారేజ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హన్సిక వివాహ వేడుకలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలో లైవ్ స్ట్రీమింగ్ కానుందట. పెళ్లికి రెండు రోజుల ముందు మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు కూడా ఓటీటీ ప్లాట్ ఫాంలో ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది. అయితే ఏ ఓటీటీ వేదికలో ప్రసారం అవుతాయి అనేది మాత్రం ఇంకా తెలియ రాలేదు. కాగా లేడీ సూపర్ నయనతార వివాహాన్ని కూడా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యూమెంటరీగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు