Harish Shankar : శేఖర్ మాస్టర్ స్టెప్‌పై హరీష్ యూటర్న్… దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు..

Harish Shankar : మాస్ మహారాజ రవితేజ, మాస్ డైరెక్టర్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్.. ఆగస్టు 15 న ఇండిపెండెన్స్ డే సందర్బంగా థియేటర్లలోకి వచ్చింది. ఆ సినిమా మొదటి షోతో యావరేజ్ టాక్ ను అందుకుంది. ఆ సినిమా మొదటి నుంచి ఓ రేంజులో హైప్ ను క్రియేట్ చేసింది. ఆ బజ్ రిలీజ్ అయ్యాక లేదు. అనుకున్న కలెక్షన్స్ కూడా రాలేదు. అయితే ఈ సినిమాలోని ఓ డ్యాన్స్ స్టెప్ అసభ్యంగా ఉందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.. ఆ స్టెప్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. అయిన ట్రోల్స్ ఆగలేదు.. తాజాగా ఓ షోకు వెళ్లిన ఆయన దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. దానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

తాజాగా హరీశ్ శంకర్ దావత్ అనే షోలో పాల్గొన్నాడు. గతంలో ఈ షోను రీతూ చౌదరి హోస్ట్ గా చేసింది. ఇప్పుడు సీజన్ 2 కు బిగ్ బాస్ బ్యూటి అరియనా గ్లోరీ హోస్ట్ గా వ్యహరిస్తున్నారు. ఆగష్టు 15 నుంచి ఈ షో సెకండ్ సీజన్ మొదలు కానుంది. ఈ షోకు ఇప్పటికే చాలా మంది గెస్టులు వచ్చారు.. ఆ ఎపిసోడ్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ షోకు ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ గెస్టుగా అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

Harish Shankar once again gave clarity on Mr. Bachchan's step
Harish Shankar once again gave clarity on Mr. Bachchan’s step

ఆ షో ప్రోమోలో హరీష్ తన పర్సనల్ విషయాలతో పాటుగా ఆయన చేసిన సినిమాలా గురించి చెప్పాడు. ఎన్టీఆర్ తో తన మొదటి సినిమా అని చెప్పాడు.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సినీ ప్రయాణం గురించి చెప్పాడు. ఈ క్రమంలో మిస్టర్ బచ్చన్ స్టెప్ పై క్వచ్చన్ ను యాంకర్ ధీటుగా సమాధానం చెప్పాడు. ఆ స్టెప్స్ అసభ్యకరమైన కామెంట్స్ వినిపించాయి. అందులో శేఖర్ మాస్టర్ తప్పు అయితే లేదు.. ఆయనను అనే రైట్ ఎవరికీ లేదు. నేను చెయ్యమంటే చేశాడు. అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఇంకా ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈయన తర్వాత సినిమాను రామ్ పోతినేనితో చెయ్యనున్నాడని టాక్..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు