Haromhara OTT : హరోం హర ఓటీటీ రిలీజ్ వాయిదా… అంతా ప్రణీత్ హన్మంతు వల్లే..?

Haromhara OTT.. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా, ప్రముఖ హీరోయిన్ మాళవికా శర్మ హీరోయిన్ గా నటించిన చిత్రం హరోంహర. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన హరోంహర గత నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమాని జ్ఞాన సాగర ద్వారక తెరకెక్కించారు.. సినిమా విడుదలకు ముందు సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ , గ్లింప్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. అయితే సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు.. దీంతో మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ లో సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈనెల 11 నుంచి ఆహా , ఈటీవీ విన్ యాప్ లలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. అయితే ముందుగా ప్రకటించినట్లుగా నిన్నటి నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. సాంకేతిక పరమైన సమస్యతోనే సినిమా ఓటీటీ లో ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి . కానీ అసలు విషయం తాజాగా వైరల్ అవుతుంది..

Haromhara OTT : Haromhara OTT release postponed... all because of Praneet Hanmantu..?
Haromhara OTT : Haromhara OTT release postponed… all because of Praneet Hanmantu..?

ప్రణీత్ హన్మంతు వల్లే వాయిదా

తాజాగా ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయడానికి ముందే మేకర్స్ ఆపి వేసినట్లు సమాచారం. ముందుగా ఈ సినిమాల్లో యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు సీక్వెన్స్ లను తీసివేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట.. అందుకే ఓటీటీ విడుదల తేదీని వాయిదా వేసినట్లు కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో మానవ మృగంగా మారిన ప్రణీత్ హన్మంతు..

ప్రణీత్ హన్మంతు ఒక తండ్రి కూతుళ్ళ వీడియో విషయంలో భారీ రేంజ్ లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తండ్రీ కూతుర్ల కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవ్వగా… అది అసభ్యకరమైన పదజాలంతో తన స్నేహితులతో డిబేట్ పెట్టి మరీ వీడియోని వైరల్ చేశారు. అయితే ఈ వీడియో హీరో సాయిధరమ్ తేజ్ వరకు చేరడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .. సోషల్ మీడియాలో ఈ వీడియోని షేర్ చేస్తూ.. తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియాలో కొంతమంది మానవ మృగాలు తండ్రి కూతుర్ల బంధాన్ని కూడా తప్పుడుగా చూపిస్తున్నాయి.. దయచేసి మీరు మీ పిల్లల వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.. మానవ మృగాల నుండి మీ పిల్లలను కాపాడే బాధ్యత మీదే అంటూ తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

అరెస్ట్ అయిన ప్రణీత్ హన్మంతు..

ఇంతటితో ఆగకుండా సాయిధరమ్ తేజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలకు, డిప్యూటీ ముఖ్యమంత్రులకు.. సోషల్ మీడియాను వాక్ , స్వేచ్ఛ స్వతంత్రం కారణంగా దుర్వినియోగం చేసుకుంటున్నారు.. ఇలాంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని కోరారు… దీంతో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందిస్తూ… ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు .. తప్పకుండా కలసి పనిచేద్దాం అంటూ పిలుపునిచ్చారు. అయితే తక్షణమే స్పందించిన తెలంగాణ డిజిపి అతనిపై కేసు ఫైల్ చేసి అరెస్టు చేశారు. ప్రణీత్ సారీ చెప్పినా సరే ఇటువంటి దుర్మార్గమైన పనిని చేసినందుకు అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు సమాచారం.. ఇలాంటి వ్యక్తి తమ సినిమాలో ఉన్నాడని తెలిస్తే సినిమాకు బాడ్ ఇమేజ్ వస్తుంది అన్న కారణంతో నిర్మాతలు అతడి సన్నివేశాలను సినిమా నుంచి తొలగించి.. మళ్లీ తిరిగి ఓటీటీ లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆహా, ఈటీవీ విన్ ఆప్ లలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు