Horror Movies on Hotstar : హాట్ స్టార్ లో ఉన్న టాప్ హార్రర్ మూవీస్… భయపడకుండా చూసే దమ్ముంటేనే చూడండి

Horror Movies on Hotstar : భయాన్ని, ఉత్కంఠను పెంచే హారర్ మూవీస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. హాంటెడ్ హౌస్‌ల నుండి ప్రతీకారం తీర్చుకునే ఆత్మల వరకు… ఇలాంటి కంటెంట్ తో వచ్చే ఈ హారర్ సినిమాలు మనలో ఉండే భయాలను మరింత రెట్టింపు చేస్తాయి. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన హాట్‌స్టార్ లో మీ వెన్నులో వణుకు పుట్టించేలా, మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబబెట్టేలా ఉంచే హారర్ సినిమాలు కొన్ని ఉన్నాయి. అతీంద్రియ కథల నుండి ఆధునిక సైకలాజికల్ థ్రిల్లర్‌ల వరకు హాట్ స్టార్ లో ఉన్న వర్త్ వాచింగ్ అనిపించే సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నో ఎగ్జిట్

‘నో ఎగ్జిట్’లో హవానా రోజ్ లియు ప్రధాన పాత్రను పోషించింది. ఇందులో ఆమె డార్బీ అనే పాత్రలో కన్పించింది.ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ ప్రయాణం మొదలు పెట్టే యువతి మంచు తుఫాను వల్ల చిక్కుకుని అపరిచితుల ఇంట్లో ఆశ్రయం పొందవలసి వస్తుంది. ఆమె పార్కింగ్ స్థలంలో ఉన్న వ్యాన్‌లో కిడ్నాప్ చేయబడిన అమ్మాయిని గుర్తించస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది అనే థ్రిల్లింగ్ అంశాన్ని చూసి తీరాల్సిందే.

ది హాంటింగ్ ఆఫ్ ది హిల్ హౌస్

‘ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్’ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న అద్భుతమైన హర్రర్ సిరీస్‌ అని చెప్పవచ్చు. షిర్లీ జాక్సన్ నవల ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. క్రేన్ కుటుంబం భయానక అనుభవాలను, తమను వెంటాడే గతాన్ని, వారి పూర్వీకుల ఇంటిని వెంటాడుతున్న దుర్మార్గపు ఆత్మలను ఎదుర్కొంటారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారు తప్పకుండా ఈ సినిమాపై ఓ లుక్కేయాల్సిందే.

- Advertisement -

ద హిల్స్ హ్యావ్ ఐస్

నాగరికతకు దూరంగా ఉన్న ఒక నిషేధిత ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఓ కుటుంబం పరిస్థితి ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ నిర్జన ప్రదేశం ఒకప్పుడు యూఎస్ ప్రభుత్వం రహస్య అణు పరీక్షల కోసం ఉపయోగించే సైట్. ఈ ప్రాంతంలో వారి వాహనం చెడిపోయినప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఓ రహస్యమైన ప్రాణి వల్ల వాళ్ళు ఒక్కొక్కరుగా అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోతారు. మరి ఒక్కరైనా ఆ భయంకరమైన ప్రదేశం నుంచి బయట పడ్డారా అనేది ఈ మూవీని చూసి తెలుసుకోవాలి.

ది ఎంప్టీ మ్యాన్

ప్రజలను జాంబీస్‌గా మార్చే మహమ్మారితో నాశనమైన ప్రపంచంలో ఆ గందరగోళం మధ్య సజీవంగా ఉండటానికి ప్రయత్నిస్తున్న ప్రాణాలతో ఉన్న సమూహం గురించి ఉంటుంది ఈ మూవీ స్టోరీ. వ్యాధి సోకిన వారంతా జాంబిలుగా మారి బ్రతికున్న వాళ్ళను చంపుకు తింటూ ఉంటే, బ్రతికి ఉన్న వాళ్ళు ప్రాణాలు అరచేత పట్టుకుని వాళ్ళ నుంచి, ఆ పట్టణం నుంచే తప్పించుకోవడానికి అత్యవసరంగా ఒక ప్రణాళికను రూపొందిస్తారు.

‘ది ఎంప్టీ మ్యాన్’ అనేది గ్రిప్పింగ్ హర్రర్ చిత్రం. మిమ్మల్ని ఆద్యంతం సీట్ ఎడ్జ్ న ఉంచే మూవీ. ఇది హాట్‌స్టార్‌లో ఉన్న అత్యుత్తమ హారర్ సినిమాలలో బెస్ట్ గా నిలుస్తుంది. మంచి సినిమాటిక్ అనుభూతిని కోరుకునే వారికి షాక్‌లు, థ్రిల్‌ల కాంబినేషన్ లో అదిరిపోయే మూవీ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు