Indian2 : భారతీయుడు2 ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటన.. ఎప్పుడంటే?

Indian2 : ఈ ఇయర్ భారీ అంచనాలతో విడుదలైన సినిమాల్లో ఇండియన్2 కూడా ఒకటి. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఇండియన్ జేమ్స్ కెమెరూన్ గా పిలువా బడే శంకర్ షణ్ముగం దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కిందని తెలిసిందే. ఇక 28 ఏళ్ళ కింద వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా “భారతీయుడు 2” తెరకెక్కగా, జులై 12న విడుదలైన ఈ సినిమా ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ సొంతం చేసుకోలేకపోయింది. బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల, సినిమాలో వందేళ్ల ముసలి పాత్రకు కూడా ఫైట్ సీన్లు ఓవర్ గా పెట్టడంతో ఈ సినిమా ఆ రేంజ్ హిట్ కాలేకపోయింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 160 కోట్ల వరకు మాత్రమే రాబట్టి డిజాస్టర్ అయింది.

Indian2 movie will be streaming on Netflix OTT from August 9

భారీ నష్టాలు తీసుకొచ్చిన ఇండియన్2..

ఇక ఇండియన్2 సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా, థియేటర్లలో మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫైనల్ గా బిజినెస్ లో సగం కూడా రికవరీ చేయలేక నష్టాలపాలయింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సినిమా వంద కోట్ల నష్టాలను తెచ్చిపెట్టిందని టాక్. ఇదిలా ఉండగా ఇండియన్2 డిజాస్టర్ అయ్యాక ఓటిటి రిలీజ్ పై కూడా పలు వార్తలు బాగా వైరల్ అయ్యాయి. సినిమా ప్లాప్ అయింది కాబట్టి, తొందరగానే ఓటిటి లో వచ్చేస్తుందని వార్తలు వచ్చాయి. కొందరు నెటిజన్లు ఈ సినిమా ఆగస్టు 9 నుంచే ఈ చిత్రం ఓటిటిలో వచ్చేస్తుంది అని స్ట్రాంగ్ బజ్ వచ్చింది. అనుకున్నట్టుగానే లేటెస్ట్ గా ఇండియన్2 ఓటిటి అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

- Advertisement -

ఇండియన్2 ఓటిటి స్ట్రీమింగ్ ఫిక్స్…

ఇక ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇండియన్2 సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. చాలా మంది అనుకున్న డేట్ కే ఇండియన్2 ఓటిటి డేట్ ఫిక్స్ అయింది. భారతీయుడు2 సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ అప్డేట్ ఇస్తూ, భారతీయుడు2 సినిమాను ఈ ఆగస్టు 9నే అందుబాటులోకి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. అంటే మరో నాలుగు రోజుల్లో సినిమా వచ్చేస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో నటించగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని, సూరి, ఎస్. జె. సూర్య, బాబీ సింహా తదితరులు నటించారు. ఇక ఇండియన్3 సినిమా 2025 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు