Satyabhama OTT : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ యాక్షన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

Satyabhama OTT : టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించింది.. గతంలో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో నటిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న ఈ అమ్మడు పెళ్లి తర్వాత సెలెక్టడ్ పాత్రలు చేస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతూ వస్తుంది.. ఈ ఏడాది భగవంత్ కేసరి సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకుంది.. ఇటీవల క్రైమ్ యాక్షన్ మూవీ సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది..

ఈ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన సినిమా జూన్ 7 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ అదరగొట్టేసింది. ఈ మూవీ కాజల్ నటనకు ఎప్పటికీ విమర్శకుల ప్రశంసలు వచ్చినా జనాలు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. దాని ఫలితంగా థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకుంది.. గతంలో కాజల్ ను ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో చూడొచ్చు. అందుకే జనాల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది.. థియేటర్లలో పర్వాలేదనిపించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది..

Kajal action movie that came to OTT silently.. Where can you watch it?
Kajal action movie that came to OTT silently.. Where can you watch it?

ఈ సరికొత్త యాక్షన్ మూవీ సత్యభామ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.. కాజల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఆరమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ టిక్కా నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఇందులో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, నాగినీడు, హర్షవర్దన్, రవి వర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ ఎడ్మ కీలకపాత్రలు పోషించారు.. ఈ సినిమా కథ సస్పెన్స్ గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు ఓటీటీలో సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు