Kalki: సినిమా ప్రేమికులకు ఈ ఆగస్ట్ బెస్ట్ , ఇంకొన్ని రోజుల్లో ఓటిటి కల్కి

Kalki: కొందరు కొన్ని వ్యసనాలకు బానిసలు అవుతారు అంటారు. అలానే సినిమాలకు కూడా వ్యసనం పడిన అభిమానులు ఉంటారు అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు టిఎఫ్ఐ బాగుండాలి అంటూ పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. కెరియర్ని సైతం పక్కనపెట్టి టీఎస్ఐ కోసం రక్తాలు చిందించే ఆడియన్స్ ఉన్నారు. పర్సనల్ గా వాళ్ళ జీవితంలో ఎన్ని అప్పులు ఉన్న, ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ దాదాపు మూడు గంటలపాటు మర్చిపోయేలా చేసే ఏకైక ప్రదేశం సినిమా అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకే తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప సినిమాకి ఎప్పుడు ఆదరణ చూపిస్తూ ఉంటారు.

మామూలుగా ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అవుతూ వస్తుంది. అయితే ఈ ఆగస్టు మంత్ మాత్రం శుక్రవారం సినిమాలు రిలీజ్ అవ్వడం తో పాటు రీ రిలీజ్ సినిమాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ మంత్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇంద్ర, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నటించిన మాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి వంటి సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. మురారి సినిమా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇక ఈ సినిమా సెలబ్రేషన్స్ మామూలు రేంజ్ లో లేవని చెప్పాలి. కొందరు ఏకంగా పెళ్లిళ్లు కూడా చేసుకునే స్థాయికి వచ్చారు.

Kalki

- Advertisement -

 

ఆగస్టు 15న రెండు కమర్షియల్ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత వారం రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర రిలీజ్ కానుంది. ఆ తర్వాత నాగార్జున సినిమా తో పాటు నాని నటిస్తున్న “సరిపోదా శనివారం” కూడా రిలీజ్ అవుతుంది. వీటన్నింటి మధ్యలో ఆగస్టు 23న థియేటర్ వద్ద సంచలన సృష్టించి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేసిన కల్కి సినిమా ఓటిటి లో రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 23 నుంచి కల్కి సినిమా స్ట్రీమింగ్ కి రానుంది. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఇంక డిజిటల్ మీడియాలో ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు