Kalki 2898 AD OTT : కల్కిని ఓటీటీలో చూడాలని అనుకుంటున్నారా…? అయితే అర్జెంట్‌గా నిర్ణయం మార్చుకోండి..

Kalki 2898 AD OTT :  పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది.. మొదటి షోతోనే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పటికి సినిమా వచ్చి రెండు వారాలు పూర్తయిన కలెక్షన్స్ మాత్రమే తగ్గలేదని తెలుస్తుంది.. ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా రాబట్టింది.. ఇప్పటికే కలెక్షన్ల జోరు తగ్గలేదు.. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడూ వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా ఓటీటీ అప్డేట్ గతంలో వచ్చింది.. ఇప్పుడు కాస్త పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది..

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో గట్టిగానే బజ్ వినిపిస్తుంది.. వచ్చే నెల ఆగష్టు 15 న ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను రెండు ఓటీటీలోకి రాబోతుందని తెలిసిందే.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కల్కి చిత్రం స్ట్రీమింగ్ అవుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ అవ్వబోతుందంటూ చాలా మంది అనుకుంటున్నారు.. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా ఆలస్యంగా ఓటీటీలోకి రాబోతున్నట్లు చెబుతున్నారు..

Kalki, which is going to be released on OTT later, when will it be streaming?
Kalki, which is going to be released on OTT later, when will it be streaming?

ఈ మధ్య కాలంలో విడుదల అవుతున్న సినిమాలు అన్ని నెలలోపే ఓటీటీలోకి విడుదల అవుతున్నాయి. కానీ ఈ సినిమా విడుదలై చాలా రోజులు అయినా కూడా ఓటిటి అప్డేట్ మాత్రం ఇంకా రాకపోవడం పై ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీ హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నాలుగు భాషల కోసం అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు పెట్టినట్లు టాక్. మరోవైపు హిందీ వెర్షన్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.175 కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది. వినాయక చవితికి స్ట్రీమింగ్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది.. చూడాలి అప్పుడన్న విడుదల అవుతుందా లేదా అని..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు