Kalki2898AD : డిజిటల్ లోనూ కల్కి రికార్డులు.. ఆ ఫీట్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు..

Kalki2898AD : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా థియేటర్లలో ఏ రేంజ్ భీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా సైంటిఫిక్ ఆక్షన్ థ్రిల్లర్ గా, మైథలాజికల్ రిఫరెన్స్ తో తెరకెక్కగా, సరిగ్గా రెండు నెలల కింద థియేటర్లలో విడుదలై పెను సంచలనం సృష్టించింది. ప్రీమియర్స్ నుండే యానానిమస్ టాక్ తో రికార్డులు బద్దలు కొడుతూ వచ్చిన కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1100 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ గా కల్కి పేరిట ఉంది. ఇక కల్కి సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిన యాభై రోజుల తర్వాతే డిజిటల్ ఓటిటి లో రిలీజ్ కాగా, ఇక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Kalki2898AD is getting a solid viewership in OTT

డిజిటల్ లో కల్కి ఊహించని రికార్డ్…

ఇక ప్రభాస్ (Prabhas) కల్కి సినిమా డిజిటల్ లో కూడా ఊహించని రికార్డులు క్రియేట్ చేస్తుంది. కల్కి థియేట్రికల్ రన్ పూర్తయిన 10 వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో కల్కి2898AD రిలీజ్ కాగా, హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక కల్కి రెండు ఓటిటిలలో కూడా ఎక్స్ లెంట్ వ్యూయర్షిప్ తో దూసుకుపోతుంది. కల్కి సినిమా వరల్డ్ వైడ్ గా ఓటిటి లో గత వారం రోజులుగా ట్రెండ్ అవుతున్న నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో రెండో స్థానంలో ఉండడం విశేషం. ఇక నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ అయితే ఓ రేంజ్ లో వ్యూస్ దక్కించుకుండగా, ఇప్పటికే 4.5 మిలియన్ నిమిషాల వ్యూస్ దక్కించుకోగా, నెట్ ఫ్లిక్స్ (Net Flix) లో అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ అందుకున్న ఇండియన్ సినిమాగా కల్కి నిలిచిందని సమాచారం.

- Advertisement -

పార్ట్2 పై మరింత క్యూరియాసిటీ..

ఇక కల్కి (Kalki2898AD) సినిమా థియేటర్లలో అదరగొట్టగా, ఇప్పుడు డిజిటల్ లో కూడా భారీ వ్యూస్ సాధిస్తుంది. థియేటర్లలో చూడలేని ఆడియన్స్, ఓటిటి లో రెండు మూడు సార్లు చూస్తుండగా, మూవీ లవర్స్ ఇప్పుడు రెండో పార్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పాలి. అయితే రెండో పార్ట్ ఇప్పట్లో వచ్చేలా లేదు. ఎందుకంటే దీనికంటే ముందు ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్, స్పిరిట్, శౌర్యంగ పర్వం, హను రాఘవపూడి సినిమా కూడా రావాల్సి ఉంటుంది. బహుశా వీటిలో ఏదైనా హోల్డ్ లో పెడితే మరింత తొందరగా కల్కి పార్ట్ 2 వచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా 2026 లోనే కల్కి సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు