Mirzapur3 : మీర్జాపూర్ ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్.. మున్నా భయ్యా ని రంగంలోకి దించారు..

Mirzapur3 : ఇండియాలో ఓటిటి వెబ్ సిరీస్ లపై ఓ రేంజ్ ఊపుని తీసుకొచ్చిన వెబ్ సిరీస్ “మిర్జాపూర్” సిరీస్. సినిమాలకి ఏమాత్రం తక్కువ కానీ రేంజ్ లో కమర్షియల్ గా ఉండే ఈ వెబ్ సిరీస్. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సిరీస్ లో బూతు డైలాగ్స్, కొన్ని అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆడియన్స్ అప్పట్లో ఎగబడి చూసారు. ఈ సినిమాతోనే పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi) లాంటి విలక్షణ నటుడికి బ్రేక్ వచ్చింది. గతంలో మీర్జాపూర్ పేరిట రెండు సిరీస్ లు రాగా, మూడో సిరీస్ పై ఫుల్ హైప్ పెంచేయగా, కొన్నిరోజుల కింద విడుదలైంది మిర్జాపూర్ వెబ్ సిరీస్3(Mirzapur3). అయితే ఈ సిరీస్ మొదటి రెండు పార్ట్ ల అంతగా మంచి రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. మున్నా భయ్యా పాత్రని రెండో భాగంలో చంపేయడమే దీనికి కారణమని టాక్. అయితే ఇప్పుడు మిర్జాపూర్ మేకర్స్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది.

Makers are adding bonus episode in Mirzapur season 3

బోనస్ పార్ట్ ని యాడ్ చేస్తున్న మేకర్స్..

ఇక మిర్జాపూర్3 వెబ్ సిరీస్ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుండగా, మొత్తం మూడు సక్సెస్ ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ కి కూడా హింట్ ఇచ్చింది. అయితే మూడో సీజన్ ఆశించినంత రెస్పాన్స్ తెచ్చుకోకపోవడంతో మేకర్స్, ఆ లోటును భర్తీ చేయాలనీ చూస్తున్నారు. అందుకే రిలీజ్ అయిన కొన్ని రోజులకు మూడో సీజన్లో ఒక బోనస్ ఎపిసోడ్ ని కూడా అందిస్తున్నట్టుగా మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. దీనితో ఆ సర్ప్రైజింగ్ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఫైనల్ గా ప్రైమ్ వీడియో వారు ఆ సర్ప్రైజ్ ని రివీల్ చేసేసారు.

మున్నాభాయ్యని రంగం లోకి దించుతున్నారు..

- Advertisement -

ఇక మిర్జాపూర్ అన్ని సీజన్లలో హైలెట్ పాత్ర ఏదంటే మున్నా భయ్యా పాత్ర. అయితే ఆ క్యారెక్టర్ ని రెండో సీజన్లో క్లైమాక్స్ లో చంపేసేసరికి చాలా మందికి ఆసక్తి తగ్గిపోయింది. అందుకే మూడో సీజన్ పై అంతగా ఆసక్తి కూడా రాలేదు. అయితే తాజాగా యాడ్ చేస్తున్న బోనస్ ఎపిసోడ్ కోసం మున్నాభాయ్యా ని రంగంలోకి దించారు మేకర్స్. రిలీజ్ చేసిన వీడియోలో మున్నా భాయ్ రోల్ చేసిన దివ్యేందు శర్మ (Divyendu Sharma) మాట్లాడుతూ, ఆ బోనస్ ఎపిసోడ్ ఆగష్టు 30 నుంచి అందుబాటులోకి వస్తుంది అని అనౌన్స్ చేయగా, ఆ ఎపిసోడ్ లో బహుశా మున్నా భాయ్ పాత్రని మళ్ళీ ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని టాక్. అయితే చనిపోయిన పాత్రని మళ్ళీ బతికిస్తారా? లేక పంకజ్ త్రిపాఠి మరో కొడుకు పాత్రలో తీసుకువస్తారా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు