OTT : ఇలాంటి పొలిటికల్ సెటైర్ మూవీని ఎక్కడ చూసి ఉండరు.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే..?

OTT : మలయాళం పొలిటికల్ సైటైర్ డ్రామా మూవీ మలయాళీ ఫ్రొం ఇండియా. ఈ సినిమా ప్రశంసలు దక్కించుకుంటుంది. మే 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయినయి చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో థియేటర్లలోను మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.

నివిన్ పౌలీ,ధ్యాన్ శ్రీనివాసన్, అన్యస్వర ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. ఈ సినిమా జులై 5వ తేదీన సోనీ లీవ్ ఓటిటి ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ విషయాన్ని సోనీ లీవ్ నేడు అనగా జూన్ 19న అధికారికంగా ప్రకటించింది.

Malayalee from India OTT
Malayalee from India OTT

అయితే మలయాళం మినహా డబ్బింగ్ వెర్షన్ లపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ మూవీ తెలుగులోను స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీకి డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. కేరళ రాజకీయాలపై సెటైరికల్ గా ఈ మూవీని రూపొందించారు. ఇక ఈ చిత్రం ధియేటర్లలో సూపర్ హిట్ కావడంతో.. ఓటిటి స్ట్రీమింగ్ పై మంచి బజ్ ఏర్పడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు