Manoj Bajpayee: ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ మధ్య క్రాస్ ఓవర్… హిలేరియస్ రిప్లై ఇచ్చిన మనోజ్

Manoj Bajpayee: బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటిస్తున్న పాపులర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 త్వరలోనే రిలీజ్ కాబోతోంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మనోజ్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3, షాహిద్ కపూర్ నటిస్తున్న ఫర్జీ సీజన్ 2 మధ్య క్రాస్‌ ఓవర్ ఉండే అవకాశం గురించి ప్రస్తావించారు. రెండు వెబ్ సిరీస్‌లను ప్రఖ్యాత ద్వయం రాజ్ & డికె రూపొందించడం విశేషం. అయితే ఈ క్రాస్ ఓవర్ ప్రశ్నకు మనోజ్ హిలేరియస్ రిప్లై ఇచ్చారు.

ది ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఫర్జీ క్రాస్‌ ఓవర్‌

ది ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఫర్జీ క్రాస్‌ ఓవర్ అవకాశం గురించి అడిగినప్పుడు మనోజ్ బాజ్‌పేయి “అమెరికన్ కాంట్రాక్ట్ చాలా కఠినంగా ఉంది. నేను ఏదైనా చెబితే నాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని తిరిగి తీసేసుకుంటారు. అందుకే నేను ఈ విషయం గురించి ఏమీ మాట్లాడలేను. ఎవరేం అనుకున్నా సరే కానీ ఇది సరదాగా ఉంటుంది” అంటూ మనోజ్ చెప్పుకొచ్చారు.

ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ గురించి మనోజ్ మాట్లాడుతూ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. షూటింగ్ జరుగుతోంది. మేము ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసాము. ఆ షెడ్యూల్ లో నేను 1:30 గంటలకు నిద్రపోయాను. ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాము” అని అన్నారు. అయితే మనోజ్ చేసిన కామెంట్స్ విన్నాక ఖచ్చితంగా ది ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఫర్జీ మధ్య క్రాస్‌ ఓవర్ ఉంటుందని నమ్ముతున్నారు. మరి రాజ్ అండ్ డీకే ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి.

- Advertisement -

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3

మనోజ్ బాజ్‌పేయ్ ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ ఫ్రాంచైజీలో మూడవ సీజన్ చిత్రీకరణను ప్రారంభించాడు. రాజ్ అండ్ డీకే రూపొందించిన ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి శ్రీకాంత్ తివారీ అనే మధ్యతరగతి వ్యక్తిగా నటించాడు. అతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విభాగం అయిన థ్రెట్ అనాలిసిస్ అండ్ సర్వైలెన్స్ సెల్ (TASC)కి ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌ గా, మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ గా ద్వంద్వ జీవితాన్ని గడుపుతాడు. ఈ సిరీస్ ను సుమన్ కుమార్, రాజ్ అండ్ డీకే రచించారు. ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూడవ సీజన్‌లో సుచిత్ర తివారీగా ప్రియమణి, జేకే తల్పాడేగా షరీబ్ హష్మీ, ధృతి తివారీగా ఆశ్లేషా ఠాకూర్, అథర్వ్ తివారీగా వేదాంత్ సిన్హా వంటి ప్రముఖ నటీనటులు నటించబోతున్నారు. మొదటి రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో 3 వ సీజన్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఓటీటీ ప్రియులు.

ఫర్జీ సీక్వెల్ ఎప్పుడంటే?

బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ ‘ఫర్జీ’లో విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్, కేకే మీనన్, రాశి ఖన్నా, భువన్ అరోరా నటించారు. నకిలీ డబ్బును సృష్టించాలని నిర్ణయించుకున్న కళాకారుడి చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది. ఈ ఎనిమిది ఎపిసోడ్ ల సిరీస్ ఫిబ్రవరి 2023లో ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇప్పుడు సీక్వెల్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు