Biggboss : ఎలిమినేషన్.. అంతా మా ఇష్టం

బిగ్ బాస్ హౌస్.. దీనిపై ఎన్ని వ్యతిరేక కామెంట్స్ వచ్చానా, ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. అయితే గత సీజన్ ల కంటే తక్కువ టీఆర్పీ వస్తుంది అనేది మాత్రం వాస్తవం. ఇదిలా ఉండగా గత వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో వాసంతి కృష్ణ తో పాటు బాలాదిత్య హౌస్ నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. మరి ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారో.. అని బిగ్ బాస్ ఆడియన్స్ తెగ ఆలోచిస్తున్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మెరీనా అబ్రహాం ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. అయితే ఈ వారం కూడా ఎలిమినేషన్ లో బిగ్ బాస్ నిర్వహకులు తమకు ఇష్టం వచ్చినట్టే వ్యవహరిస్తున్నారని ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఎందుకంటే..? ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా జరిగిన ఓటింగ్ లో మెరీనా కంటే శ్రీ సత్యకు ఓట్లు తక్కువ వచ్చాయట. కానీ మెరీనాను నిర్వహకులు టార్గెట్ చేసి ఇంటికి పంపేస్తున్నారని కొంతమంది ప్రేక్షకుల వాదన. దీనికి కారణం లేకపోలేదు.

మెరీనా-రోహిత్ జంటగా హౌస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. వీరి నుంచి కొంత వరకు మసాలాను నిర్వహకులు అంచనా వేశారు. కానీ వీరి మధ్య కెమిస్ట్రీ బాగున్నా.. మరీ నిర్వహకులు అంచనాలను అందుకోలేదు. ఇదే సమయంలో శ్రీ సత్య – శ్రీ హాన్ ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. వీరి నుంచి నిర్వహకులకు కావాల్సిన మసాలా కూడా వస్తోంది. ఈ సమయంలో ఓట్లు తక్కువ వచ్చిన శ్రీ సత్యను ఇంటికి పంపించేస్తే.. టీఆర్పీ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కానీ మెరీనా ను ఎలిమినేట్ చేస్తే అది జరగదు. దీంతో నిర్వహకులు శ్రీ సత్య కంటే మెరినాకు ఎక్కువ ఓట్లు వచ్చానా మెరీనానే ఇంటికి పంపించారు అని తెలుస్తుంది.

- Advertisement -

ఈ రోజు రాత్రి జరగబోయే ఎపిసోడ్ లో మెరీనా బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రాబోతుందని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు