Mirzapur 3 Trailer: మీర్జాపూర్ 3 ట్రైలర్ వచ్చేసింది… ఆ సీన్స్ హైలెట్…

Mirzapur 3 Trailer : ఈ మధ్య కాలంలో సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మూవీ లవర్స్.. అందులో కొన్ని వెబ్ సిరీస్ లకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ కూడా ఒకటి.. ఈ వెబ్ సిరీస్ ఇప్పటివరకు ఈ సిరీస్ రెండు సీజన్ లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు తాజాగా మూడో సీజన్ వచ్చేస్తుంది.. అందుకు సంబందించిన ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.. ప్రస్తుతం ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

గతంలో వచ్చిన రెండు సీజన్లకు మించి ఇప్పుడు రాబోతున్న సీజన్ ఉండబోతుందని ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది.. మీర్జాపూర్ లో ఈసారి ఏం జరగబోతోంది. ఎవరు మీర్జాపూర్ లో గద్దెను ఎక్కబోతున్నారు? కొత్తగా మీర్జాపూర్ లోకి ఎవరు వచ్చారు? ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి? పంకజ్ త్రిపాఠి ఏమయ్యాడు? ఇవన్నీ మీర్జీపూర్ సీజన్ 3లో ఉండబోతున్నాయనేది ట్రైలర్ లో చూడవచ్చు.. రెండో సీజన్ ముగింపులో దాదాపుగా పంకడ్ త్రిపాఠిని చంపేసేవాళ్లు. కానీ, పంకజ్ త్రిపాఠి తప్పించుకున్నాడు. కానీ, అతని కొడుకు కాలిన్ భయ్యా మాత్రం చనిపోయాడు. అలాగే బీనా ఆంటీ తన కొడుకును కాపాడుకోవడం కోసం గుడ్డు దగ్గర చేరింది..

Mirzapur 3 Trailer highlight
Mirzapur 3 Trailer highlight

ఆ తర్వాత అతనితో మెల్లగా ప్రేమలో పడుతుంది.. గుడ్డు భయ్యాని తనకు అనుకూలంగా గైడ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మీర్జాపూర్ లో గుడ్డు హవా స్టార్ట్ అయ్యింది. అలాగే శత్రువుల సంఖ్య కూడా పెరిగిపోయింది. మరోవైపు కాలిన్ భయ్యా భార్య విధవిరాలిగా మారిపోయింది.. ఇక గుడ్డు ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. గతంలో వచ్చిన సీజన్లో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.. మొత్తానికి ఈ ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే మంచి వ్యూస్ ను అందుకుంది.. ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు