Mirzapur season 3: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మీర్జాపూర్ సీజన్ 3.. స్ట్రీమింగ్ డేట్ వెతుక్కోండి అంటూ సినీ ప్రియులకు షాక్..!

Mirzapur season 3: మిర్జాపూర్ క్రైమ్ థ్రిల్లర్ ఇండియా వైట్ గా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించి రెండు సీజన్లు పూర్తయి అద్భుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. ఇక రెండో సీజన్ 2020లో వచ్చి ప్రేక్షకుల అంచనాలని మరింత రెట్టింపు చేయడంతో సీజన్ 3 ను ఏర్పాటు చేశారు మేకర్స్.

ఈ క్రమంలో తాజాగా మేకర్స్ మిర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ ను రివిల్ చేశారు. కానీ బిగ్ ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులకు పరీక్ష పెట్టారు. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన చేశారు. కానీ స్ట్రీమింగ్ తేదీ ప్రకటించకుండా యానిమేటెడ్ పోస్టర్ రిలీస్ చేసి మీరే వెతుక్కోండి అని క్యాప్షన్ ఇచ్చారు. అందులో డేట్ దాగుందని అది కనిపెట్టాలని చెప్పి బిగ్ టెస్ట్ పెట్టారు.

Mirzapur season 3 is coming to digital streaming
Mirzapur season 3 is coming to digital streaming

ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన వారంతా డేట్ ను కనిపెట్టలేక తలకాయలు పట్టుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం అందులో ఉన్న వస్తువులను బట్టి జులై 7న ఇది స్ట్రీమింగ్ కి వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం జులై 21 అంటూ చెబుతున్నారు. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ తెలియాలంటే ప్రైమ్ వీడియో వారు స్పందించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు