Violence Movies : ఇక్కడ గాంధీ బొమ్మలు ఆడవు… కడప కింగే కావాలి

Violence Movies : పోకిరి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది… “గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు… కడప కింగ్ అని తీయ్… 200 సెంటర్స్… 100 డేస్” అప్పుడు షియాజీ షిండేతో పూరి జగన్నాథ్ ఏ ఉద్ధేశ్యంతో ఈ డైలాగ్ చెప్పించాడో తెలీదు కానీ, నిజానికి ఈ డైలాగ్ ఇప్పటి సమాజానికి సరిగ్గా సెట్ అవుతుంది. థియేటర్స్‌లో మెసెజ్ ఓరియెంటెడ్ సినిమాలు గానీ, ఇతర సెంటిమెంట్ సినిమాలను కానీ, ఆడవు. కానీ, వయోలైన్స్ ఎక్కువ ఉన్న సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతారు. సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ ఇచ్చినా, పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే, A సర్టిఫికేట్ ఉన్న సినిమాలకే ఇప్పుడు గిరాకీ ఎక్కువ. ఈ విషయం ఎప్పుడు ఎందుకు అంటే…

మిర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్…

నిన్న సాయంత్రం (గురువారం సాయంత్రం) మిర్జాపూర్ సీజన్ 3 వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పటికి 24 గంటలు కావస్తుంది. దీనికి వచ్చిన వ్యూస్ దాదాపు 8 మిలియన్లు. అంటే ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ కు ఇంతటి వ్యూస్ వచ్చాయంటే, కారణం ఒకే ఒక్కటి… ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి గతంలో వచ్చిన 1 & 2 సీజన్స్ లో ఉన్న వయోలెన్స్ అనే చెప్పొచ్చు. నిజానికి ఈ 3వ సీజన్ లో కూడా వయోలెన్స్ భారీగానే ఉంది. అది ఈ ట్రైలర్ తో స్పష్టం అవుతుంది.

ఈ ట్రైలర్‌లో వయోలెన్స్ తో పాటు అడల్ట్ సీన్స్ ఎక్కువే ఉంటాయని అందరికీ తెలుసు. అందుకే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కు 24 గంటల్లో ఏకంగా 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సిరీస్ జూలై 5న రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ కే ఇలాంటి రియాక్షన్ వచ్చిందంటే, సిరీస్ వచ్చిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోకి ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు