Don : ‘డాన్’ ఓటిటి రిలీజ్ డేట్ చెప్పి తప్పు చేశారా?

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ చాలా సైలెంట్ గా తెలుగులో కూడా మార్కెట్ ను బిల్డ్ చేసుకునే పనిలో పడ్డాడు. ‘రెమో’ ‘సీమ రాజా’ ‘శక్తి’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ కార్తికేయన్.. గతేడాది ‘డాక్టర్’ చిత్రంతో మరింతగా క్రేజ్ ను పెంచుకున్నాడు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం సైలెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

తాజాగా విడుదలైన ‘కాలేజ్ డాన్’ కూడా అంతే. ‘సర్కారు వారి పాట’ పక్కన చప్పుడు చేయకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి కలెక్షన్లను సాధిస్తుంది. మే 13 న విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో రూ.1 కోటి షేర్ ను రాబట్టింది. ఇంకో రూ.30 లక్షలు రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. ఇప్పుడు మరో 100 స్క్రీన్లు ఈ మూవీకి పెంచారు.

అయితే ఈ మూవీ మే 27నే ఓటిటిలో రిలీజ్ అవుతుంది అనే వార్త ఇప్పుడు ఊపందుకుంది. నెట్ ఫ్లిక్స్ మరియు సన్ నెక్స్ట్ లలో ఈ చిత్రం మే 27 నుండీ స్ట్రీమింగ్ కాబోతుందట. ఈ చిత్రానికి శివ కార్తికేయన్ కూడా ఓ నిర్మాత కాబట్టి.. పాండమిక్ టైంలోనే భారీ రేటుకి ఓటిటి హక్కులను అమ్మేశారట. ఈ విషయం బయటకి తెలిసిన దగ్గర్నుండీ ఈ మూవీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ పడుతున్నట్టు వినికిడి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు