OTT Movie : వెన్నులో వణుకు పుట్టించే కొరియన్ సైకో కిల్లర్ మూవీ… వరుసగా 18 హత్యలు

OTT Movie : ఓటిటిలో ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ కొరియన్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. అందులోనూ సైకో కిల్లర్ సినిమా అంటే ఎంత భయంకరంగా ఉన్నా తప్పకుండా చూస్తారు. సినిమా పూర్తయ్యే చివరి నిమిషం వరకు సస్పెన్స్ తో కట్టిపడేసే ఈ ఎంగేజింగ్ సినిమాలను చూసి థ్రిల్ ఫీల్ అయ్యే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇదే జానర్ కు సంబంధించింది. పైగా కొరియర్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా. కొరియన్ సినిమాలంటే చెవి కోసుకునేవారు ఈ మూవీని ఏ ఓటిటిలో చూడొచ్చు? స్టోరీ ఏంటి? అని ఇంట్రెస్టింగ్ విషయాలను చూసేద్దాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియన్ థ్రిల్లర్ ఒక సిరీస్. ఇందులో థ్రిల్లర్ మూవీ లవర్స్ ఎక్స్పెక్ట్ చేసే సస్పెన్స్, మర్డర్ మిస్టరీ వంటి ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

Mouse – A Mystery Drama That Will Keep ...

- Advertisement -

స్టోరీ ఏంటంటే….

సినిమా మొదట్లోనే ఓ అమ్మాయి అర్ధరాత్రి ఇంటికి వెళ్తుంది. అయితే మార్గం మధ్యలో ఓ పాప ఎదురొచ్చి తమ కారుకు యాక్సిడెంట్ అయ్యింది, హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ చిన్న పాప ముఖం చూసి బాధపడిన ఆ అమ్మాయి హెల్ప్ చేయడానికి వెళ్తే అక్కడ దాడి జరుగుతుంది. ఆ తర్వాత రోజే హెల్ప్ చేయడానికి వెళ్ళిన అమ్మాయి శవంగా తేలుతుంది. కానీ తల మాత్రం కనిపించదు. ఒక సస్పిషియస్ నెంబర్ ఆమె చేతిపై కనిపిస్తుంది. ఇదే విధంగా అప్పటిదాకా ఏకంగా 18 వరుస హత్యలు జరుగుతాయి. పోలీసులకు మాత్రం ఇలా వరుస హత్యలు చేస్తున్న ఆ సైకో దొరకడు. అసలు వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే విషయం ఓ పట్టానా అర్థం కాదు. దీంతో కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఆ సైకోకి హెడ్ హంటర్ అని పేరు పెడతారు. ఈ కేసును సాల్వ్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కొడుకు కూతుర్ని కూడా ఆ హంటర్ కిడ్నాప్ చేసి దారుణమైన రీతిలో హత్య చేస్తాడు. డేనియల్ అనే ఒక సైంటిస్ట్ ను అమెరికా నుంచి కొరియాకు తీసుకొస్తారు. మనుషుల మీద ఎక్స్పరిమెంట్ చేసే అతన్ని ఈ కేసు సాల్వ్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. అతనేమో బిడ్డ తల్లి గర్భం నుంచి బయట ప్రపంచంలోకి రాకముందే సైకోనా కాదా అనే విషయాన్ని కనిపెడతాడు. ఒకవేళ ఆ పుట్టబోయే బిడ్డ సైకో అనిపిస్తే వెంటనే అబార్షన్ చేయిస్తారు. ఈ కొరియాలో అతనికి ఓ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతని భార్య ప్రెగ్నెంట్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే డేనియల్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. అందులో భాగంగా తన ఫ్రెండే ఆ హంటర్ అని కనిపెడతాడు. అసలు హాన్ నిజంగానే ఈ హత్యలు చేశాడా? ఆయన భార్యకు పుట్టబోయే పిల్లలని డానియల్ ఏం చేశాడు? హాన్ ఇలా ఎందుకు హత్యలు చేశాడు ? అనే విషయం తెలియాలంటే మౌస్ అనే ఈ సినిమాను చూసి తీరాల్సిందే. కానీ ఈ సినిమాస్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు రెంటల్ బేసిస్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు