Mr Bacchan : మిస్టర్ బచ్చన్ ఓటిటి డేట్ ప్రకటన.. నాలుగు వారాలకే స్ట్రీమింగ్.. ఇదైనా మెప్పిస్తుందా?

Mr Bacchan : మాస్ మహారాజ్ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ “మిస్టర్ బచ్చన్” సినిమా ఆగష్టు 15న విడుదలైన సంగతి తెలిసిందే. వీళ్ళ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కగా భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రవితేజ (Raviteja) కం బ్యాక్ సినిమా అవుతుందనుకుని థియేటర్లకు వెళ్లిన అభిమానులకు పెద్ద దెబ్బేసాడు డైరెక్టర్. తన రొటీన్ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తే.. రవితేజ సైతం కొత్తదనం లేని పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ కి బోర్ కొట్టించాడు. ఇక ఈ సినిమా థియేటర్లలో వీకెండ్ కే చేతులెత్తేయగా, తాజాగా ఓటిటి లో రావడానికి సిద్ధమైంది.

Mr Bacchan will be streaming on Netflix from September 12

మిస్టర్ బచ్చన్ ఓటిటి డేట్ ప్రకటన..

ఇక మిస్టర్ బచ్చన్ సినిమా థియేటర్లలోంచి వారం రోజులకే జెండా ఎత్తేయగా, డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చింది ఈ సినిమా. పైగా ఈ నష్టాలను భర్తీ చేయడానికి రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ తమ రెమ్యూనరేషన్ల లోంచి కొంతభాగాన్ని వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా మిస్టర్ బచ్చన్ ఓటిటి ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ (Net Flix) దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయిన నెలన్నర తర్వాత అంటే దాదాపు 7 వారాల తర్వాత స్ట్రీమింగ్ కి ఒప్పందం కుదుర్చుకుంది. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో కేవలం నాలుగు వారాలకే ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. ఇక మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) సినిమా సెప్టెంబర్ 12 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు అనౌన్స్ చేసారు.

- Advertisement -

ఇదైనా ఓటిటిలో మెప్పిస్తుందా?

ఇక పంద్రాగస్టున మిస్టర్ బచ్చన్ తో పాటే రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) కూడా డిజాస్టర్ కాగా, రీసెంట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది. కానీ ఓటిటి లో కూడా ఆ సినిమాకి పూర్తిగా నెగిటివ్ రెస్పాన్స్ రాగా, డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని భారీగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా అయినా ఓటిటి లో మెప్పిస్తుందా లేక డబుల్ ఇస్మార్ట్ లాగే ఓటిటి లో కూడా నెగిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటుందా అనేది చూడాలి. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాకి కూడా హరీష్ శంకర్ డైరెక్షన్ చాలా మైనస్ అయిందని కామెంట్స్ వస్తున్నాయి. మరి థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన మిస్టర్ బచ్చన్ కనీసం ఓటిటి లో అయినా మెప్పిస్తుందా లేదా చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు